Begin typing your search above and press return to search.

ఫ‌రూక్ సంచ‌ల‌నం స‌రే..జ‌గ‌న్ కు ఆయ‌నేం చెప్పారు?

By:  Tupaki Desk   |   27 March 2019 5:38 AM GMT
ఫ‌రూక్ సంచ‌ల‌నం స‌రే..జ‌గ‌న్ కు ఆయ‌నేం చెప్పారు?
X
ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.. ఎన్నిక‌లకు ముందే ఓట‌మి భ‌యం వెంటాడుతున్న టీడీపీ అధినేత‌కు.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన నాటి నుంచి అంత‌కంత‌కూ ప‌డిపోతున్న గ్రాఫ్ తో కిందామీదా ప‌డుతున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. త‌న ఛ‌రిష్మాతో వ‌ర్క్ వుట్ కాద‌న్న విష‌యాన్ని గుర్తించిన బాబు.. ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన సీనియ‌ర్ నేత‌ల్ని ఏపీలో దింపుతున్నారు.

తన‌కు తాను పెద్ద తోపుగా గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు.. ఈ రోజున ఇత‌ర రాష్ట్రాల‌కుచెందిన సీనియ‌ర్ నేత‌ల్ని తెప్పించుకొని మ‌రీ ప్ర‌చారం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమిటి? తాను అనునిత్యం జ‌గ‌న్ మీద చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు ఏపీ ప్ర‌జ‌లు పెద్ద‌గా రియాక్ట్ కాక‌పోవ‌టంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి నేత‌ల్ని తెచ్చుకుంటున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఓట‌మి భ‌యంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన నేత‌ల‌తో కొత్త కొత్త ఆరోప‌ణ‌లు చేయిస్తున్నారు చంద్ర‌బాబు. దీనికి నిద‌ర్శ‌నంగా తాజాగా క‌ర్నూలు జిల్లాలో జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లే నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

త‌న ఇంటికి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌ను సీఎం చేయాల‌ని.. అలా చేసిన ప‌క్షంలో కాంగ్రెస్ కు రూ.1500 కోట్లు ఇస్తాన‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించిన జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా మాట‌ల్లోని అసలు క‌థ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బ‌ట్ట కాల్చి ఎదుటోళ్ల మీద వేయ‌టం.. దాన్ని ఆర్పుకోవ‌టం త‌మ ప్ర‌త్య‌ర్థుల త‌ల‌నొప్పిగా చేయ‌టం చంద్ర‌బాబుకు మొద‌ట్నించి అల‌వాటే. తాజాగా ఆయ‌న అలాంటి వ్యూహాన్నే అమ‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తాను చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాని నేప‌థ్యంలో.. ఇత‌ర రాష్ట్రాల నుంచి నేత‌ల్ని తీసుకొచ్చి త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌రూక్ అబ్దుల్లా చెప్పింది నిజ‌మే అనుకుందాం. కానీ.. ఈసారే ఆయ‌న నోటి నుంచి ఈ మాట‌లు ఎందుకు వ‌చ్చిన‌ట్లు? నిజంగానే జ‌గ‌న్ అంత ప్ర‌మాద‌కారి అయిన‌ట్లైతే.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌నీ విష‌యాన్ని ఎందుకు చెప్ప‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ‌గ‌న్ త‌న‌తో చెప్పిన మాట‌కు.. తాను ఏమ‌ని బ‌దులిచ్చారన్న విష‌యాన్ని ఫ‌రూక్ చెప్ప‌కపోవ‌టం మ‌ర్చిపోకూడ‌దు. ఇదంతా చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల్ని ఏదోలా ప్ర‌భావితం చేసి ఎన్నిక‌ల్లో గెల‌వాల‌న్న చంద్ర‌బాబు త‌ప‌న కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌కమాన‌దు.