Begin typing your search above and press return to search.
ఇండియా-పాక్ గొడవకు సూపర్ సొల్యూషన్
By: Tupaki Desk | 11 Nov 2015 7:34 AM GMTఇండియా-పాకిస్తాన్... వేర్వేరు దేశాలుగా ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు శత్రుదేశాలుగానే ఉన్నాయి. ఇంత శత్రుత్వానికి ముఖ్యకారణం కశ్మీర్. ఈ భూభాగంపై ఎవరికి హక్కు ఉండాలనేదే అసలు సమస్య. ఈ సమస్యకు తాజాగా ఓ పరిష్కారం దొరికింది. అది కూడా దేశమంతా అంగీకరించే సుప్రసిద్ధ ప్రధానమంత్రి అటల్ బిహర్ వాజ్ పేయి మదిలో నుంచి వచ్చింది. మంచాన పడి అచేతనంగా ఉన్న వాజ్ పేయి తన పరిష్కారాన్ని ఇప్పుడెలా సూచిస్తున్నారు అనుకుంటున్నారా? జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రతిపాదనను వెలుగులోకి తీసుకువచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కూడా ఆ ఫార్ములాకు ఓకే అంటుందని చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఆ విశేషాలు ఏంటంటే....1999 పాకిస్తాన్ పర్యటన సమయంలో నాటి ప్రధాని ఆటల్ బిహారీ వాజ్ పేయి జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఓ పరిష్కారం చూపించారు. అదేంటంటే... పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సర్వాధికారాలు తనవేనని పాక్ భావిస్తున్నపుడు, భారత్ వైపున్న కాశ్మీర్ అంశంపై పూర్తి అధికారాలు భారత్ వేనని పాక్ అంగీకరించాలని వాజ్ పేయి సూచించారు. అయితే అప్పట్లో ఆ ఫార్ములాను పాక్ ప్రభుత్వం తిరస్కరించింది.
వాజ్‌పేయి ఆనాడు సూచించిన ఫార్ములాను ప్రస్తుత నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా ఉందంటూ ఫరుక్ అబ్దుల్లా తన అంచనాలను ఒక ఇంటర్వ్యూ లో వివరించారు. నాడు పాక్ అగ్రనేతలతో తాను మాట్లాడానని, కాశ్మీర్ లో సగభాగం పాక్ లోనూ, మిగతా భాగం భారత్ అజమాయిషీలో ఉన్నందున ఎవరి అధీనంలో ఉన్న భూభాగంపై వారే ఆధిపత్యం వహించవచ్చుననే ప్రతిపాదన మంచిదేనని వారు అంగీకరించినట్లు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఫరూక్ అబ్ధుల్లా చెప్పారు. 2001లో ఆగ్రా సదస్సులో తీసుకున్న విషయాల్ని కూడా ఫరూక్ వివరించారు.
పాక్ అంగీకరించే అవకాశముందని జమ్మూకు చెందిన నేత చెప్తున్నందున దీనిపై దృష్టిసారించి ఇరుదేశాల మధ్య ఉన్న పంచాయతీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందేమో.