Begin typing your search above and press return to search.
ఫాస్టాగ్ లేదా? ఆ ఆఫర్ మీకు రానట్లేనట
By: Tupaki Desk | 17 Jan 2020 4:36 AM GMTగడిచిన కొద్ది రోజులుగా ఫాస్టాగ్ పేరు మీద వస్తున్న వార్తలు అన్ని ఇన్ని కావు. ఇంతకీ ఈ ఫాస్టాగ్ ఏంది? దాని గోలేంది? కొత్త రూల్స్ ఏమిటి? అన్న క్వశ్చన్లు చాలా తక్కువ మందే వేయొచ్చు. ఆ మాటకువస్తే.. ఫాస్టాగ్ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా.. అవన్నీ కారు ఉన్నోళ్లే తప్పించి.. లేని సామాన్యలకు అస్సలు సంబంధమే లేని పరిస్థితి.
కారులో టోల్ ఫ్లాజాల మీదుగా ప్రయాణించే వారికి మాత్రమే ఫాస్టాగ్ అవసరం ఉంది. ఇప్పటివరకూ టోల్ ఫ్లాజాల వద్ద టోల్ ఛార్జ్ చెల్లించి వెళుతున్నారు. దీని కారణంగా టోల్ ఫ్లాజాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయే కానీ.. వాటికి సంబంధించిన అధికారిక లెక్కలు బయటకు రావటం లేదు. పవర్ ఉన్న కొద్ది మంది చేతుల్లో టోల్ ప్లాజాల నిర్వహణ సాగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతికత అయిన ఫాస్టాగ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఫాస్టాగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పినా.. అసలు వాస్తవం అది కాదని చెప్పాలి. తాజాగా తీసుకొచ్చిన కార్డుల పుణ్యమా అని.. టోల్ ప్లాజాల అసలు ఆదాయం ఎంతన్నది లెక్క తేల్చటానికి వీలుంటుంది. అదే జరిగితే.. ఇంతకాలం ప్రభుత్వానికి పలువురు టోల్ కాంట్రాక్టర్లు ఎంతలా హ్యాండిచ్చారన్న విషయం మీద లెక్కలు తేలనున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫాస్టాగ్ కార్డులు లేని వారి విషయంలో కేంద్రం కొరడా ఝుళిపించింది.
ఇప్పటివరకూ అమలవుతున్న విధానం ప్రకారం టోల్ వెళ్లిన మార్గంలో 24 గంటల్లో తిరిగి వస్తే టోల్ ట్యాక్స్ లో 50 శాతం రాయితీ ఇచ్చే వీలుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఆఫర్ ను బంద్ చేయనున్నారు. ఫాస్టాగ్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తారని.. లేనోళ్లకు ఈ రాయితీని వర్తింపచేయరని స్పష్టం చేస్తున్నారు.
టోల్ దగ్గర క్యాష్ చెల్లించిన వారికి ఈ రాయితీ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టోల్ వద్ద ఆఫర్ అందాలంటే తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాల్సిదేనని చెప్పక తప్పదు. సో.. మీకు కారుందా? అయితే.. తప్పనిసరిగా వెంటనే ఫాస్టాగ్ ను తీసుకోండి.లేకుంటే చిక్కుల్లో పడటం ఖాయం సుమా.