Begin typing your search above and press return to search.
ఫాస్టాగ్ కు చెల్లుచీటి.. త్వరలో 'టోలు' తీసే సరికొత్త వసూళ్లు
By: Tupaki Desk | 9 Aug 2022 5:12 AM GMTమీకు కారుందా? అని కూడా అడగొద్దు. మీకు వాహనం ఉందా? అన్నది సరైన మాట. రోడ్డు మీద నుంచి నేషనల్ హైవేల మీదకువెళ్లిన తర్వాత టోల్ చార్జిలను వసూలు చేసే ఫాస్టాగ్ విధానానికి త్వరలో మంగళం పాడేస్తున్నారు. దీని స్థానే సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకురానున్నారు.
ఇప్పటివరకు ఫాస్టాగ్ విధానంలో మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు ప్రయాణించే సమయంలో టోల్ మధ్యలో ఉన్న దారికి మాత్రమే టోల్ ఛార్జి చెల్లిస్తుంటారు. ఈ ఫాస్టాగ్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు. ఇప్పుడున్న ఫాస్టాగ్ పద్దతిలో జీపీఎస్ శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించి టోలు వసూలు చేయాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఇప్పటికే జీపీఎస్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్టను షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఈ కొత్త విధానంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా ఉండనుంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ పద్దతిలో ఒక టోల్ ప్లాజా నుంచి మరో టోల్ ప్లాజా మధ్యనున్న దూరాన్ని ఆధారంగా చేసుకొని ఛార్జీలు వసూలు చేసేవారు.
ఇప్పుడు అందుకు భిన్నంగా వాహనం నేషనల్ హైవే మీద ఎన్నికిలోమీటర్లు ప్రయాణించిందో లెక్క వేసి.. దానికితగ్గట్లు ఛార్జీ వసూలు చేసే విధానం అమల్లోకి రానుంది. ఈ దెబ్బకు వాహనం బయటకు తీసి నడిపితే చాలు.. తోలు ఊడేలా కేంద్రం వాయించేయనుందన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన విధానాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం వెల్లడించాల్సి ఉంది.
తాజాగా ఈ కొత్త విధానం గురించి కేంద్ర రోడ్డు రవానా.. రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఏడాది లోపు దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్ లను తొలగిస్తున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే. కొత్తవిధానంలో కదులుతున్న వాహనం జీపీఎస్ ఇమేజెస్ ఆధారంగా టోల్ ఛార్జి వసూలు చేయటం ద్వారా.. మరింత పారదర్శకంగా వసూళ్లు ఉండనున్నట్లుగా చెబుతున్నారు.
2016లొ తీసుకొచ్చిన ఫాస్ట్ ట్యాగ్ విధానం కారణంగా టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించటంతో పాటు.. గంటల తరబడి వెయిట్ చేసే పద్దతికి మంగళం పాడనున్నారు. ఈ సరికొత్త సాంకేతికత వ్యవస్థను దేశవ్యాప్తంగా ఉన్న 1.37 లక్షల వాహనాలపై ఈ కొత్త విధానాన్ని ప్రయోగిస్తారని చెబుతున్నారు.