Begin typing your search above and press return to search.
పారిపోతున్న ఖైదీని పట్టిచ్చిన 'ఫాస్టాగ్'.. ఎలాగంటే!!
By: Tupaki Desk | 7 May 2022 8:06 AM GMTనేరాలను అదుపు చేసేందుకు ఇటీవల కాలంలో పోలీసులు టెక్నాలజీని వినియోగిస్తున్న విషయం తెలి సిందే. అయితే.. తాజాగా మన తెలంగాణ పోలీసులు.. ఈ టెక్నాలజీ వినియోగంలో మరింత ముందడుగు వేశారు. కేవలం కార్లు జాతీయ రహదారులపై టోల్‌గేట్లను దాటేందుకు మాత్రమే వినియోగించే ఫాస్టాగ్‌ను సైతం వీరు వినియోగించి.. ఒక జీవిత ఖైదీని అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగింది?
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు నుంచి జీవిత ఖైదీ ఒకరు సినీ ఫక్కీలో తప్పించుకుని పరారయ్యాడు. వివిధ నేరాలకు పాల్పడటంతో రవిశంకర్ అనే వ్యక్తి... హైదరాబాద్ చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తు న్నాడు. 2019లో వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ చీటింగ్, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న రవిశంకర్‌ను... విచారణ నిమిత్తం మిర్యాలగూడ కోర్టుకు తీసుకువచ్చారు.
అయితే.. కోర్టు ప్రాంగణంలో బంధువులతో మాట్లాడుతున్నట్లు నటించిన రవిశంకర్... పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. జీవిత ఖైదీ తప్పించుకు పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పారిపోతున్న ఖైదీని ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖతర్నాక్ ఖైదీ!!
నల్గొండలోని మిర్యాలగూడ, ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నవులూరు గ్రామానికి చెందిన రవిశంకర్(46) పై తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని హయత్నగర్లో 2019 లో జరిగిన కిడ్నాప్, అత్యాచారం కేసులో రవిశంకర్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ శ్రీధర్ తో ములాఖత్కి వచ్చిన అతడి బంధువులతో రవిశంకర్ పరిచయం చేసుకున్నాడు. మే నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, ఆరోజు అక్కడికి రావాలని వారిని కోరాడు. గురువారం ఉదయం రవిశంకర్ ను అంబర్పేట హెడ్ కోటర్స్ కు చెందిన రిజర్వు పోలీసులు మిర్యాలగూడ తీసుకువచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడికి వచ్చిన తన మిత్రులతో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను కోరారు.
రవిశంకర్ అప్పటికే అక్కడ వేచి ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతే ఇక తన పథకం ఆచరణలో పెట్టేందుకు రెడీ అయ్యాడు. పక్కనే వారి కారు(టీఎస్ 08జీఎల్ 8818) చూశాడు. కారు తాళలు అక్కడే వదిలేసి ఉండటంతో కిలాడీ పని సులువయింది. అంతే ఒక్కసారిగా కారెక్కి వేగంగా డ్రైవ్ చేశాడు. నిందితుడు కారులో అద్దంకి రహదారి దిశగా దూసుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో నివ్వెరపోయిన రిజర్వు పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో రంగంలోకి దిగారు.
ఫాస్టాగ్ తో ఇలా పట్టేసుకున్నారు!
డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖైదీ గురజాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కాసేపటికి ఆ ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఫాస్టాగ్ ఆధారంగా ప్రయత్నించారు. అయితే నిందితుడి ఆనవాళ్లు దొరకాలని పోలీసులు పకడ్భందీ ప్లాన్ రెడీ చేసుకున్నారు. దారిలో ఎలాగూ టోల్ గేట్లు వస్తాయని, అక్కడ డబ్బులు చెల్లించనిదే కారు ముందుకెళ్లే ప్రసక్తే ఉండదని.. దీంతో నిందితుడు కారు వదిలేసి పారిపోతే ట్రేస్ చేయడం కష్టమని భావించారు. వెంటనే కారులో ఫాస్టాగ్ కు అప్పటికప్పుడు రీఛార్జి చేయించి కారు వెళ్లే మార్గాన్ని అనుసరించారు.
ఏపీ పోలీసుల సాయంతో..
నల్గొండ జిల్లా పోలీసు కంట్రోల్ రూం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒంగోలు జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మల్లూరు ప్రాంతం వద్ద కారులో వస్తున్న రవిశంకర్ ను గుర్తించారు. దాదాపు ఏడు కిలోమీటర్లు వెంబడించి టంగుటూరు టోల్ గేట్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం మిర్యాలగూడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఖైదీని పట్టుకోవడానికి సాయపడిన ఫాస్టాగ్కు పోలీసులు థ్యాంక్స్ చెప్పారు. సో.. టెక్నాలజీ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో ఈ ఘటన ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు.