Begin typing your search above and press return to search.
ఏపీలోని 7 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా వ్యాప్తి!
By: Tupaki Desk | 6 May 2021 10:30 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతుంది. దేశంలో నమోదు అయ్యే రోజువారీ కేసులు మూడు రోజులు తగ్గినట్టే తగ్గి నేడు మరోసారి ఊహించని స్థాయిలో పెరిగాయి. దేశవ్యాప్తంగా 4 లక్షల 13 వేల కేసులు తాజాగా నమోదయ్యాయి. అలాగే , దాదాపు 4 వేల మంది ఒక్క రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, దేశంలో గడచిన రెండు వారాల సమయంలో 30 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడు జిల్లాలు ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు , శ్రీకాకుళం , తూర్పుగోదావరి , గుంటూరు , విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జిల్లాలు కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలి స్థానంలో, 7 జిల్లాలో ఏపీ రెండోస్థానంలో ఉంది. కర్ణాటకలో 3, తమిళనాడులో 2, హరియాణాలో 2, మహారాష్ట్రలో 2, మధ్యప్రదేశ్ లో 2, బిహార్, ఉత్తరాఖండ్ లో ఒక్కో జిల్లా ఉంది.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న మహారాష్ట్రలోని పుణే, థానే, ముంబయి, లాతూర్, ఔరంగాబాద్, భండారా, ముంబయి సబర్బన్, నాందేడ్, గోండియా, ధూలే, నందూర్బార్ జిల్లాలు, మధ్యప్రదేశ్ లో 8, ఛత్తీస్ గడ్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు, ఝార్ఖండ్, లేహ్, లడఖ్, గుజరాత్ ల్లో ఒక్కో జిల్లాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసుల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉండగా 20%కిపైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో రోజువారీ కేసుల తగ్గుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి.