Begin typing your search above and press return to search.
తాలిబన్ల ఆరాచకం కళ్లకు కట్టినట్లు చెప్పిన చిన్నారి తండ్రి
By: Tupaki Desk | 26 Aug 2021 3:15 AM GMTసినిమాల్లో దోపిడీలు.. దొమ్మీలు.. హీరోల వీరోచిత పోరాటాలు.. కసిగా చంపేసుకోవటాలు లాంటివి చూసినప్పుడు ఉద్వేగానికి గురవుతాం కానీ.. భయాందోళనకు గురవ్వము. కానీ.. అలాంటివే మన కళ్ల ముందు.. మన వాళ్లకు ఎదురైప్పుడు మనకు మొదట కలిగేది భయం. ఆ వెంటనే ఆందోళన.. వెరసి.. ముందా సమస్య నుంచి బయటపడితే చాలురా భగవంతుడా? అన్నట్లు పరిస్థితి మారుతుంది. ఇప్పుడు తాలిబన్ల ఏలుబడిలో ఉన్న అఫ్గాన్ లోని కోట్లాది మంది పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. తాలిబన్ల దారుణాలు ఎంతలా ఉన్నాయన్న విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడో చిన్నారి తండ్రి.
తాలిబన్ రాక్షసుల నుంచి తప్పించుకొని భారత్ కు వచ్చిన అతడు.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. భార్య.. ఇద్దరు పిల్లలతో బిక్కుబిక్కుమంటూ భారత్ కు వచ్చిన అతడు ఇప్పుడు దీర్ఘంగా ఊపిరి వదులుతున్నాడు. వీలైనంత త్వరగా ఇప్పటికి ఆప్గాన్ లో ఉన్న తన తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఇండియాకు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు.
తాలిబన్ల ఆరాచకం గురించి ఆతడు చెప్పే మాటలు వింటే వణుకు పుట్టాల్సిందే. ‘వాళ్లు నలుగురు వ్యక్తుల్ని చంపటం నా చిన్న కుమార్తె కళ్లారా చూసింది. అప్పటి నుంచి భయంతో వణికిపోతోంది. రాత్రిళ్లు నిద్రపోకుండా ఏడూస్తూనే ఉంది. మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. ఇక్కడ తాలిబన్లు ఉండరని నేను ఎంత చెప్పినా కూడా తను తన భయాన్ని పోగొట్టుకోలేకపోతోంది. తను ఎప్పటికి మామూలుగా మారుతుందో తెలీటం లేదు’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు.
అప్గాన్ నుంచి శరణార్ధిగా భారత్ కు వచ్చిన అతను.. తమ మాదిరే తమ వాళ్లు కూడా క్షేమంగా భారత్ కు వచ్చేయాలని కోరుతున్నాడు. అఫ్గాన్ లో తాలిబన్ల ఆరాచకం గురించి చెప్పిన అతడేమన్నాడంటే.. ‘‘తాలిబన్లు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఎదిరించిన వారిపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. సంపదను దోచుకెళుతున్నారు. కేవలం రూ.60వేల నగదు.. కొన్ని సూట్ కేసులతో భారత్ కు వచ్చాను. రాత్రికి రాత్రి నా జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు’ అని వాపోయారు.
తమ ఇంటికి వచ్చిన తాలిబన్లు బెదిరింపులకు దిగారని.. ఇంటి మొత్తాన్ని దోచేశారని.. షాపును పడగొట్టారన్నారు. ‘‘మొత్తం సర్వనాశనం చేశారు. వాళ్లు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే భారత అధికారులు నన్ను.. నా భార్యా పిల్లల్ని తీసుకొని ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చేశారు. అలా ఆ నరకం నుంచి బయటపడ్డాం. ఇప్పుడు విషాదం ఏమంటే.. నా తల్లిదండ్రులు ఇంకా అక్కడే ఉన్నారు. వారు కూడా క్షేమంగా భారత్ కు వచ్చేస్తే చాలు’’ అని వాపోతున్నాడు. ఇలాంటి విషాద ఉదంతాలు లెక్కలేనన్ని అఫ్గాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. అఫ్గాన్ నరకానికి నకలుగా మారిందన్న భావన కలుగక మానదు.