Begin typing your search above and press return to search.

లాగి పెట్టి ఒక్కటి పీకినట్లుగా ఉన్న ఈ కార్టూన్ కు కేసీఆర్ ఏమంటారో?

By:  Tupaki Desk   |   12 Nov 2021 6:30 AM GMT
లాగి పెట్టి ఒక్కటి పీకినట్లుగా ఉన్న ఈ కార్టూన్ కు కేసీఆర్ ఏమంటారో?
X
సింఫుల్ గా.. సూటిగా.. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేయటమే కాదు.. నిష్ఠూర నిజాన్ని చెబుతూ.. పాలకులకు మంట పుట్టేలా చేయటంలో కార్టూన్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
తాజాగా ఒక కార్టూన్ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని రీతిలో ఉందని చెప్పాలి. చెప్పే బడాయి మాటలకు.. అందుకు భిన్నంగా ఉండే చేతల్ని ప్రశ్నించేలా ఉన్న ఈ కార్టూన్ చూసినంతనే అర్థమయ్యేలా ఉండటం దీని ప్రత్యేకత.
మారిన పరిస్థితుల్ని ఇట్టే అర్థమయ్యేలా ఉండటం.. సామాన్యుడు సైతం ఈ కార్టూన్ చూసినంతనే ప్రభుత్వాల ఫెయిల్యూర్ ను కళ్లకు కట్టేలా చూపించిన వైనాన్ని అభినందించాల్సిందే. చదువుకున్నా ఉద్యోగం రాని వ్యవస్థల్ని గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నదే. తాజాగా శ్రమించి పండించినా కొనకుండా అన్నదాతల్ని తిప్పలు పెడుతున్న వైనం తాజా కార్టూన్ లో కనిపిస్తుంది.

చదువుకున్నాను కానీ..ఉద్యోగం ఇవ్వట్లేదు అయ్యా అంటూ తండ్రికి కొడుకు తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. పంట పండించా కానీ ఎవరూకొనట్లేదు కొడకా.. అంటూ తండ్రి కొడుక్కి తన ఆక్రోశాన్ని వ్యక్తం చేసే ఈ కార్టూన్ లో నిలువెత్తు వాస్తవం ఉందని చెప్పాలి.

అంతేకాదు.. శ్రమించినోడికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న దానికి నిదర్శనంగా తాజా కార్టూన్ ఉందని చెప్పాలి.
అది చేశాం.. ఇది చేశామని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సూటిగా ఈ కార్టూన్ సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏమైనా.. కేసీఆర్ మాటల్లోని మాయాజాలాన్ని లాగి పెట్టి కొట్టినట్లుగా ఉండే ఈ కార్టూన్ చూసినంతనే వాస్తవ ప్రపచంలోకి రావటం ఖాయమని చెప్పాలి. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ కార్టూన్ ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇంత సూటిగా పంచ్ వేసే కార్టూన్లు పెద్దగా కనిపించలేదని చెప్పాలి.