Begin typing your search above and press return to search.

బిడ్డల్ని చంపేసిన తండ్రి.. వాడ్ని ఏసేసి లొంగిపోయిన భార్య

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:30 PM GMT
బిడ్డల్ని చంపేసిన తండ్రి.. వాడ్ని ఏసేసి లొంగిపోయిన భార్య
X
గతంలో ఎప్పుడూ వినని.. చూడని నేరాలకు.. ఘోరాలకు తెలుగు రాష్ట్రాలు సాక్ష్యంగా మారుతున్నాయి. విన్నంతనే షాకింగ్ గా ఉండే ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అన్నీ ఉన్నా.. ఏదో లేదన్నట్లుగా వ్యవహరించే కొందరి తీరు చూసినప్పుడు వారు బాగోకపోవటమే కాదు.. తమ చుట్టూ ఉన్న వారిని కూడా బాగోలేకుండా చేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

తాజా ఉదంతంలో అభం శుభం తెలియని చిన్నారుల్ని అనుమానంతో వారి గొంతును కోసి చంపేసిన కసాయిని కడజేర్చించి కట్టుకున్న భార్య. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

నాగర్ కర్నూలులో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఉదంతం గురించి మరింత వివరంగా తెలియాలంటే కొంతకాలం ముందుకు వెళితే తేలిగ్గా అర్థమవుతుంది. కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లకు చెందిన 39 ఏళ్ల ఓంకార్ కు మూడో భార్య మహేశ్వరి. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. వీరిద్దరి దాంపత్యానికి నిదర్శనంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కుమార్తె చందనకు మూడేళ్లు అయితే.. విశ్వనాథ్ కు ఏడాది వయసు. అయితే.. లేని పోని అనుమానాలతో తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు.

అనుమానం పెనుభూతంగా మారి భర్త విసిగిస్తున్న నేపథ్యంలో విసిగిపోయిన భార్య మహేశ్వరి వేదనకు గురయ్యేది. మాటా మాటా పెరిగి ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఇదిలా ఉంటే ఆగస్టు 17న ఓంకార్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎత్తం గుట్ట వద్దకు తీసుకెళ్లి వారిద్దరి గొంతు కోసి తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే.. చిన్నారులు ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోతే.. ఓంకార్ మాత్రం బతికిపోయాడు.

ఈ ఉదంతంతో షాక్ తిన్న మహేశ్వరి పారిపోయింది. గొంతు కోసుకొని చనిపోవాలని భావించిన ఓంకార్.. హైదరాబాద్, మహబూబ్ నగర్ లో చికిత్స పొంది ఈ నెల 16న కుడికిల్లకు వచ్చాడు.

కన్నబిడ్డల్ని చంపినోడు తనను కూడా చంపేస్తాడని భావించిన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి కత్తితో భర్తపై దాడి చేసి చంపేసింది. అనంతరం కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. తన బిడ్డల్ని చంపేసినందుకుప్రతీకారంతోనే చంపేసినట్లుగా చెబుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.