Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. తనకిష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురి హత్య!

By:  Tupaki Desk   |   5 Nov 2022 11:32 AM GMT
షాకింగ్‌.. తనకిష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురి హత్య!
X
విశాఖపట్నంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తనకిష్టం లేని వ్యక్తిని తన కుమార్తె ప్రేమించిందని రగిలిపోయిన ఓ తండ్రి తన కుమార్తెను అంతమొందించాడు. ఈ ఘటన విశాఖ నగరంలో కలకలం సృష్టించింది.

ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంలో ఎ.వి.ఎన్‌.కళాశాల సమీపంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు అరవింద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతన్ని ప్రేమిస్తున్నానని తన తండ్రికి చెప్పింది. అతడంటే సదభిప్రాయం బాలిక తండ్రి వరప్రసాద్‌ దీనికి అడ్డు చెప్పాడు.

తాను ఒప్పుకోకపోయిన తన కుమార్తె అరవింద్‌తో తిరుగుతుండటంతో ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక రోజు బాలిక తన ప్రియుడితో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో అతడిపై బాలిక తండ్రి వరప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ప్రేమ జంటను పట్టుకుని వచ్చి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయిన వరప్రసాద్‌.. అరవింద్‌తో తిరగొద్దని హెచ్చరించాడు. బాలిక ఎదురు తిరగడంతో శుక్రవారం మధ్యాహ్నం కుమార్తెను ఇంట్లోనే హత్య చేశాడు.

తన కుమార్తెను ఎందుకు చంపాల్సి వచ్చిందో కూడా నిందితుడు వరప్రసాద్‌ ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం. 'నా కుమార్తెను ఎవరో అబ్బాయి కోసం పెంచలేదు. చదువు కోసం, బాధ్యత కోసం పెంచాను. పెద్దమ్మాయి ఏదో చేసిందని ఆమెను వదిలేశాను. చిన్న కుమార్తె బాక్సింగ్‌లో చేరతానంటే చేర్పించాను. అరవింద్‌ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అతను గొడవల్లో ఉన్నాడు... ఆగాలని కోరాను. అయినా వినలేదు. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు. నా తల్లి విజయలక్ష్మి వర్ధంతి రోజే నా కుమార్తెను చంపేశాను' అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. వీడియో మధ్యలో నిర్జీవంగా పడి ఉన్న కుమార్తెను కూడా వీడియోలో చూపించాడు.

కాగా నిందితుడు వరప్రసాద్‌ భార్య కూడా అతడితో విబేధాలతో వేరుగా ఉంటున్నట్టు సమాచారం. అలాగే పెద్ద కుమార్తె కూడా విడిగానే ఉంటుందని చెబుతున్నారు. కాగా తన కుమార్తెను హత్య చేసిన వరప్రసాద్‌ పోలీసులకు లొంగిపోయాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.