Begin typing your search above and press return to search.
పిల్లి కోసం గొడవ.. కొడుకును చంపేసిన తండ్రి!
By: Tupaki Desk | 29 Oct 2022 11:30 PM GMTపిల్లి కోసం జరిగిన ఘర్షణ ఏకంగా ప్రాణాల మీదకే వచ్చింది. అన్నం తినే సమయంలో ఇంట్లోకి వచ్చిన పిల్లిన తోలలేదని.. ఆగ్రహించిన తండ్రి తన కుమారుడి అంతం చూశాడు. కని పెంచిన కొడుకు ప్రాణాలే తీశాడు. అత్యంత ఆశ్చర్యకరం, దారుణం అయిన ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగింది.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ నర్సింగపుర్ పట్టణంలోని గోట్గావ్ పోలీస్ పరిధిలో నివసిస్తున్న కేదార్ పటేల్.. చిరు వ్యాపారి. సంప్రదాయ కుటుంబం. నిష్టగా అన్ని నియమాలు పాటిస్తారు. నిత్యం పూజలు చేసుకోవడం.. శుచిగా ఉండడం కుటుంబానికి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వారు భోజనాలు చేస్తుంటే.. ఎవరూ చూడకూడదనే నియమం కూడా ఉంది. దీనిని కూడా పాటిస్తున్నారు.
అయితే.. కేదార్ పటేల్ కుటుంబంతో సహా కూర్చుని ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఒక పిల్లి వచ్చి తిన్నగా కేదార్ పటేల్ ముందు కూర్చుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేదార్.. పిల్లిని కొట్టి బయటకు పంపాలని తన కుమారుడు అభిషేక్ పటేల్ను కోరాడు.
అయితే, చేతిలో సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటున్న అభిషేక్ తన తండ్రి మాటను వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కేదార్.. మొదట పిల్లిని పట్టుకుని చంపేశాడు. అనంతరం కుమారుడిపై కూడా పదునైన ఆయుధంతో మెడపై దాడి చేశాడు. దీంతో అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనతో ఉలిక్కిపడిన కేదార్ పటేల్ భార్య పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు కేదార్ను అరెస్ట్ చేశారు. అభిషేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే.. తాను ఉద్దేశ పూర్వకంగా ఈ పనిచేయలేదని, క్షణికావేశంలో చేశానని కేదార్‌పటేల్ మీడియాకు చెప్పాడు. మరోవైపు జంతు ప్రేమికులు ఆయనపై పిల్లిని చంపిన నేరాన్ని కూడా మోపి కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.