Begin typing your search above and press return to search.
మతం...ఆరేళ్లపాపను చంపేసింది
By: Tupaki Desk | 4 Oct 2015 7:10 AM GMTజంతువుల నుంచి మనుషులను వేరుచేయడంలో, బుద్ధిజీవిగా బ్రతకడంలో కీలక పాత్ర పోషించేవి ఆలోచనలు, వాటికి కేంద్రస్థానమైన మెదడు. వీటి ద్వారానే సిద్ధాంతాలు - కట్టుబాట్లు - సంప్రదాయం - మతం వంటివాటిని ఏర్పాటుచేసుకున్నాం. ఇవన్నీ మనిషి మరింత ఆమోదయోగ్యంగా బ్రతికేందుకు, నలుగురికి ఆదర్శప్రాయంగా జీవించేందుకు ఉన్న సౌలభ్యాలు. కానీ మతోన్మాదంతో పిచ్చి పీక్ స్టేజీకి చేరిపోతున్న కొందరితో అరాచకత్వానికి పరాకాష్ట ఏంటో సమాజానికి తెలుస్తోంది.
యూపీలోని బరేలి గ్రామంలో ఈ తరహా దారుణం జరిగింది. తన కూతురు ముఖానికి ముసుగు సరిగా ధరించలేదనే కోపంతో సాక్షాత్తు కన్న తండ్రి ఆమెను చంపేశాడు. అడ్డువచ్చిన భార్యను చితకబాదాడు. అన్నం తింటున్న సమయంలో కూతురు ముఖానికి ఉన్న ముసుగు(దుపట్టా) జారిపోయింది. ముసుగు జారిపోవడాన్ని గమనించిన ఆమె తండ్రి జాఫర్ కోపంతో ఆరేళ్ల కూతురిని దారుణంగా చితకబాది, ఆమె తలను నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూతురి ప్రాణాలకు అడ్డుపడబోయిన భార్యను కూడా చితకబాదాడు జాఫర్. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు జాఫర్‌ను అరెస్టు చేశారు.
ఇది ఒక మతం తాలుకు విశ్వాసం. భోజనం చేసే సమయంలో దుపట్టా ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? అది కూడా కుటుంబం కలిసి భోజనం చేయాల్సినపుడు కూడా పరదా ఉండాలా? ఒకవేళ ఆ పరదా లేకపోతే నేలకేసి బాది చంపాల్సిందేనా? ఈ ప్రశ్నలకు మతచాందసవాదులు తప్పక సమాధానం చెప్పాలేమో.