Begin typing your search above and press return to search.

కూతురికి పెళ్లికావ‌ట్లేద‌ని.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 11:30 AM GMT
కూతురికి పెళ్లికావ‌ట్లేద‌ని.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!
X
ఏ తండ్రికైనా త‌ను క‌న్న కూతురిపై ప్రేమ ఉంటుంది. త‌న ఇంటి మ‌హాల‌క్ష్మిగా కుమార్తెల‌ను భావించే వారు చాలా మందే ఉన్నారు. కుమార్తెల‌ను ఎంతోగారంగా పెంచుకునే తండ్రులు కూడా ఉన్నారు. అయి తే, ఇంత‌గా త‌న కూతురును ప్రేమించిన ఓ తండ్రికి అతి పెద్ద క‌ష్టం వ‌చ్చిప‌డింది. పుట్టిన‌ప్పుడు బాగానే ఉన్న కుమార్తె.. త‌ర్వాత క్ర‌మంలో అంగ‌వైక‌ల్యానికి గురైంది. ఇలా.. ఐదేళ్ల‌కు పూర్తిగా మంచం ప‌ట్టింది.

ఇంత‌లోనే26 ఏళ్లు వ‌చ్చేశాయి. మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు క‌ళ్ల‌లో పెట్టుకుని చూసుకున్న ఆ తండ్రి.. వృద్ధుడై పోతున్నాడు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఎవ‌రో ఒక‌రిని వెతికి.. పెళ్లి చేయాలి. కానీ, అన్నీ మంచంలో చేసుకునే ఆ యువ‌తిని ఎవ‌రు మాత్రం పెళ్లి చేసుకుంటారు? ఇదే ఆ పెద్దాయ‌న‌కు తీర‌ని స‌మ‌స్య‌గా మారిపోయింది. 21 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయిన కుమార్తెకు దారి చూపించే దిక్కులే కుమిలిపోయాడు.

కానీ, ఇంత‌లోనే ఆయ‌న‌కు మెరుపు లాంటి ఐడియా త‌ట్టింది. దివ్యాంగురాలైన కూతురిని భ‌గ‌వాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని తండ్రి త‌ల‌పోశాడు. వెంట‌నే ఏర్పాట్లు చేసి.. ప‌నికానిచ్చేశాడు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఈ ప్రత్యేకమైన వివాహం జరిగింది. దివ్యాంగురాలైన త‌న కూతురిని శ్రీకృష్ణుడికి(భగవంతుడు) ఇచ్చి వివాహం చేశాడు. బంధుమిత్రుల మధ్య హంగు ఆర్భాటాలతో వివాహ వేడుక నిర్వహించాడు.

మోహన ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త శిశుపాల్ రాథోడ్. ఈయ‌న‌కు దివ్యాంగురాలైన కూతురు(26) ఉంది. అయితే 21 సంవత్సరాలుగా ఆమె మంచానికే పరిమితం అయ్యింది. కనీసం మాట్లాడలేదు, చెవులు సైతం వినపడవు. కూతురు పట్ల శిశుపాల్ ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. అందరి అమ్మాయిల్లాగానే తన కూతురికి వివాహం చేయాలనుకునేవాడు. కానీ, చికిత్స వల్ల ఎలాంటి మార్పులు రాకపోయేసరికి.. యువతిని సంతోషపెట్టేందుకు భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయించాలని అనుకున్నాడు.

వెంటనే, ఈ నెల 6వ తేదిన బంధువులకు ఫోన్ చేసి మరుసటి రోజు తన కూతురు పెళ్లి ఉందని కచ్చితంగా రావాలని ఆహ్వానించాడు. భగవంతుడు శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లిని శివపాల్ ఘనంగా నిర్వహించాడు. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించాడు. గుడిలో నిర్వహించిన ఈ పెళ్లి బంధుమిత్రుల మధ్య సంబరంగా జరిగింది. అంతా ఆనందాన్ని పంచుకుని చివరగా డీజేకు డ్యాన్సులు సైతం చేశారు.

తండ్రి ఉద్దేశం ఏంటి?

ఇక్క‌డ ఒక పెద్ద డౌట్ తెర‌మీదికి వ‌స్తుంది. ఇలా భ‌గ‌వంతునికి ఇచ్చి వివాహం చేసి తండ్రి త‌న చేతులు దులుపుకొన్నాడ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. శ్రీకృష్ణుడి స‌తీమ‌ణిగా త‌న కుమార్తె కీర్తిని తెచ్చుకొవ‌డ‌మే కాకుండా..ఆమె కు స‌ప‌ర్య‌లు చేసేందుకు శ్రీకృష్ణుడే త‌ర‌లి వ‌స్తాడ‌ని.. ఆయ‌నే అన్నీ చూసుకుంటాడ‌ని.. ఆ తండ్రి న‌మ్ముతుండ‌డం గ‌మ‌నార్హం. మరి ఆ దేవ‌దేవుడు 'ఆప‌న్న ప్ర‌స‌న్నుడై' ఆదుకోవాల‌ని బంధువులుసైతం కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.