Begin typing your search above and press return to search.
ఢిల్లీ వైరల్ వీడియో.. తాజా అప్డేట్స్ ఇవే!
By: Tupaki Desk | 18 Jun 2019 7:37 AM GMTనిన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక వీడియో వైరల్ అయ్యింది. ఢిల్లీ పోలీసులు ఒక సిక్కు యువకుడ్ని దారుణంగా తిట్టేస్తూ.. కొట్టేసిన వైనం చూసి అయ్యో అనుకున్నారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టేలా ఉన్న ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ.. ఆ వీడియోలో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఎందుకంత దారుణంగా కొట్టారు..? అన్న విషయంలోకి వెళితే..
45 ఏళ్ల సరబ్జీత్ సింగ్ అతని కొడుకు ప్రయాణిస్తున్న ఆటో అనుకోకుండా పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. సరబ్ జీత్ సింగ్ ను.. అతని కొడుకును రోడ్డు మీదకు లాగి.. బూట్లతో తంతూ దారుణంగా చితకబాదారు. అతడి వీపు మీద పడిన వాతలు చూస్తే.. పోలీసుల కౌర్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం కాక మానదు.
చిన్న తప్పునకు అంత దారుణంగా కొట్టేసిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టికి వెళ్లటం.. ఆయన తీవ్రంగా స్పందించి.. ఈ మొత్తం ఉదంతం మీద విచారణ జరపాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. పోలీసులు తన మీద దాడి జరుపుతున్న వేళ ఆటోడ్రైవర్ కత్తి తీసుకోవటం వివాదంగా మారింది. అయితే.. దీనిపై ఆటో డ్రైవర్ తండ్రి 75 ఏళ్ల మంజీత్ సింగ్ స్పందించారు. తన కొడుకును అన్యాయంగా పోలీసులు కొడుతున్న వేళ.. ప్రాణాలు కాపాడుకోవటానికి వీలుగా కత్తి తీశారే కానీ.. మరే ఉద్దేశ్యం లేదన్నారు. అంత దారుణంగా కొడుతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోవటానికి కత్తి తీస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆటో డ్రైవర్లు అయిన తండ్రీ కొడుకుల మీద దాడి చేసిన పోలీసుల్లో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్యాయంగా ఆటోడ్రైవర్.. అతని కొడుకుపైన దాడి చేసిన పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.