Begin typing your search above and press return to search.
ఒక పరీక్ష.. టోటల్ ఫ్యామిలీ రాసింది
By: Tupaki Desk | 1 Sep 2019 11:01 AM GMTఏపీలో ఇప్పుడు గ్రామ సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవి జరిగాయి. అయితే ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్ వేసిందే తక్కువే. తెలంగాణ ఉద్యమం.. ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏ పదేళ్లకో.. పదిహేనేళ్లకో కొలువులు భర్తీ అయ్యాయి. 2004లో ముగిసిన చంద్రబాబు హయాం తర్వాత ఉద్యోగాల భర్తీ సవ్యంగా సాగలేదు.
అయితే ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి పెళ్లి చేసుకొని పిల్లలను కన్న నిరుద్యోగులు సైతం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్వహించే గ్రామ సచివాలయ పోస్టులకు పోటీపడడం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఉద్యోగాల భర్తీ ఎంత ఆలస్యంగా జరుగుతున్నాయో కళ్లకు కడుతున్నాయి.
తాజాగా విజయనగరం జిల్లాలో గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన ఒక ఇంట్లో తండ్రి - కుమార్తె - కుమారుడు గ్రామ సచివాలయ పరీక్షకు ముగ్గురూ హాజరవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన చోళ్ల మోహన్ రావు వయసు 47 ఏళ్లు. రిజర్వేషన్ల వెసులుబాటు ప్రకారం పరీక్ష రాయడానికి ఇదే చివరి సంవత్సరం.. అవకాశం. అందుకే ఆయన పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇక ఆయన బీఈడీ పూర్తిచేసిన కుమార్తె, డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు కూడా ఇదే పరీక్షకు హాజరవ్వడం విశేషం. ఈ ముగ్గురు పోటీపడి ఈ పరీక్షకు హాజరు కావడం గమనార్హం.