Begin typing your search above and press return to search.
‘భారత్ మాతాకీ జై’కి వ్యతిరేకంగా ఫత్వా
By: Tupaki Desk | 1 April 2016 4:03 PM GMTమతం గొప్పదా? దేశం గొప్పదా? ఏ మతాన్ని ఆరాధించే వారైనా సరే.. తమకు తాము నమ్మిన దేవుడు మాత్రమే ముఖ్యమని.. ఆ తర్వాత మాత్రమే దేశాన్ని నమ్ముతామని చెబుతారా? దేశాన్ని దేవుడిగా భావించలేమని.. తమకు ఒక్క దేవుడే ఉన్నాడని.. అది తాము నమ్మే దేవుడిగా చెప్పటం..? దేశాన్ని ఆరాధించాలన్న మాటకు విగ్రహారాధనంటూ చిత్రమైన వాదనను తెరపైకి తీసుకురావటమే కాదు.. ఏకంగా ఫత్వా తీసుకొచ్చారు. ఇలాంటివి ఎక్కడ జరుగతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. అవును.. మన దేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత్ మాతాకీ జై అనే నినాదానికి వ్యతిరేకంగా ప్రముఖ ఇస్లామిక మత సంస్థ దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ సంస్థ శుక్రవారం ఫత్వా జారీ చేసింది. ఈ నినాదాన్ని నినదించాల్సిన అవసరం లేదని తేల్చింది. యూపీలోని ఉలూమ్ దేవ్ బంద్ కు దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు ఇస్లామిక స్కాలర్లు అంతా కూర్చొని రెండు రోజులు చర్చించి.. తాజా నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
‘‘భారత్ మాతాకీ జై’’ అంటే.. భారతదేశమనే నా తల్లికి జై కొడతామన్న మాట మాత్రమే. దాన్లో కూడా ఎంత బూతు వెతికారో వారి వివరణ చూస్తే అర్థమవుతుంది. దేశాన్ని తాము ప్రేమిస్తామని.. కానీ దేశమే దేవుడు కాదని చెప్పిన సదరు సంస్థ.. తాము ఒకే దేవుడ్ని నమ్ముతామని.. భారత్ మాతాకీ జై అన్న పదాన్ని పలుకకూడదని ఫత్వా జారీ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. భారత్ మాతాకీ జై అన్నది తాము సమర్థించమని.. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు నిర్ణయం తీసుకోవచ్చన్న స్వేచ్ఛ ఇవ్వకుండా తమ మతానికి చెందిన వారందరికి ఆదేశాన్ని ఇవ్వటం చూస్తే.. ఈ మత సంస్థకు తాను నిర్ణయించిందే సుప్రీం అన్న భావనే తప్పించి.. మరే కోణం కనిపించక పోవటం గమనార్హం.
అంతేకాదు.. ఈ వ్యవహారంపై మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అవేమంటే..భారత్ మాతా అనే ఒక దేవతని హిందువుల్లో ఒక వర్గం పూజిస్తుంటారు. కానీ.. ఇస్లాం నియమాల ప్రకారం మరో దేవతను పూజించకూడదు. అందుకే ఫత్వా జారీ చేస్తున్నట్లుగా సదరు సంస్థ పేర్కొంది. వీరి మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. భారత్ మాతాకీ జై అన్నది హిందు మతస్థుల మాటగా కలర్ కోటింగ్ ఇవ్వటం కనిపించక మానదు. ఈ నినాదాన్ని ఎవరు స్టార్ట్ చేశారన్నది పక్కన పెడితే.. అందరికి సులువుగా అర్థమయ్యే ఈ పదంలో దేవుడికి నచ్చని పదం ఏమిటో అర్థం కానిది.
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని తానుచేయనని.. తన గొంతు మీద కత్తి పెట్టినా అలాంటి నినాదం చేయనని చెప్పటం సంచలనం సృష్టిస్తే.. తాజాగా దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఏకంగా ఫత్వా జారీ చేయటం గమనార్హం. నిజానికి అసద్ చేసిన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ముస్లింలు సైతం మండిపడ్డారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కానీ.. ఇందుకు భిన్నంగా సదరు సంస్థ ఫత్వా జారీ చేయటం చూస్తే.. ఒక్కమాట చెప్పలనిపిస్తోంది.. మాకు మా దేవుడే ముఖ్యం. ఆ తర్వాత దేశమే ముఖ్యం అని తేల్చి చెబుతున్నప్పుడు.. కనిపించే మనుషుల కంటే.. కనిపించని దేవుడికి.. ఎక్కడున్నాడో తెలియని దేవుడికే తన ప్రాధాన్యత అని చెప్పే తెగింపు భారతదేశంలోని మైనార్టీలకు మాత్రమే సాధ్యమేమో? మరి.. ఇలాంటి వారి దేశ భక్తిని ఎంతమేరకు పరిగణలోకి తీసుకోవాలి? మరి.. దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఫత్వాపై సగటు ముస్లింలు ఎలా స్పందిస్తారో చూడాలి.