Begin typing your search above and press return to search.

ఆ ముప్పు ఇంకా భ‌యంక‌ర‌మైన‌ది.. భార‌త్ ప‌రిస్థితిపై ఫౌచీ ఆందోళ‌న‌!

By:  Tupaki Desk   |   7 May 2021 3:29 PM GMT
ఆ ముప్పు ఇంకా భ‌యంక‌ర‌మైన‌ది.. భార‌త్ ప‌రిస్థితిపై ఫౌచీ ఆందోళ‌న‌!
X
భార‌త్ లో కొవిడ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో.. అమెరికా వైట్ హౌజ్ చీఫ్‌మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌచీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రోజూవారీ కేసులు 4 ల‌క్ష‌లు దాటుతున్న వేళ‌.. ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే భార‌త్ లో లాక్ డౌన్ విధించాల‌ని అన్నారు. ఈ లాక్ డౌన్‌ క‌నీసం.. 3 నుంచి 4 వారాల పాటు అమ‌లు చేయాల‌ని సూచించారు.

వైర‌స్ చైన్ తెంప‌డానికి ఇంత‌కు మించిన మార్గం లేద‌ని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని ఆందోళ‌న చెందవ‌ద్ద‌న్న ఫౌచీ.. దాని కోసం చూసుకుంటే.. రాబోయే ముప్పు ఇంకా భ‌యంక‌రంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. వెంట‌నే తాత్కాలిక ఆసుప‌త్రులు, కొవిడ్ కేర్ సెంట‌ర్లు నిర్మించాల‌ని సూచించారు. సాధ్య‌మైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని, ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేయించాల‌ని సూచించారు.

క‌ష్ట‌కాలాల్లో భార‌త్ ఇత‌ర దేశాల‌కు అండ‌గా నిలిచింద‌న్న ఫౌచీ.. ఈ స‌మ‌యంలో ఇత‌ర దేశాలు కూడా భార‌త్ కు స‌హాయం చేయాల‌ని కోరారు. ఇత‌ర దేశాలు టీకాల‌ను సేక‌రించి, భార‌త్ కు అందించాల‌ని సూచించారు. కాగా.. కొద్ది రోజుల కింద‌ట కూడా ఇదే విష‌య‌మై మాట్లాడిన ఫౌచీ.. ఇండియాలో లాక్ డౌనే శ‌ర‌ణ్య‌మ‌ని చెప్పారు. తాజాగా.. మ‌రోసారి గ‌ట్టిగా చెప్పడం విశేషం.