Begin typing your search above and press return to search.
ట్రంప్ రాసలీలల అంతు చూస్తున్న ఎఫ్ బీఐ!
By: Tupaki Desk | 11 April 2018 8:18 AM GMTమన దేశంలో కలలో కూడా ఊహించలేని పరిణామం ఇది. ఎందుకంటే...అధికారంలో ఉన్నవాళ్లని కన్నెత్తి చూడటానికి కూడా సంబంధిత విచారణ సంస్థలు సాహసించవు. కానీ, అమెరికాలో ఏకంగా దేశాధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారంపైనే ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ సోదాలు నిర్వహించి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఆయన శృంగార లీలలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై సహజంగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ కు - శృంగార తార స్టార్మీ డానియెల్స్ కు మధ్య శృంగార సంబంధం ఉందనే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో నిజానిజాలు తేల్చేందుకు ట్రంప్‌కు చెందిన ప్రైవేట్ న్యాయవాది మైఖేల్ కోహెన్ కార్యాలయాలపై ఎఫ్ బీఐ దాడులు నిర్వహించింది. న్యూయార్క్ లోని కోహెన్ కు సంబంధించిన కార్యాలయాల నుంచి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ట్రంప్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్తున్న ఓ శృంగార తారకు కోహెన్ చెల్లించిన 1.30 లక్షల డాలర్లకు సంబంధించిన ఆధారాలనుకూడా ఎఫ్ బీఐ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడులపై ట్రంప్ స్పందిస్తూ ఎఫ్‌బీఐపై తీవ్ర విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ దాడులు అవమానకరమని, ఇది దేశంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.
కోహెన్ కార్యాలయాల నుంచి పత్రాలతోపాటు ఈమెయిళ్లు - వ్యాపార సంబంధిత పత్రాలను - బ్యాంకు రికార్డులను - శృంగార తార స్టార్మీ డానియెల్స్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎఫ్ బీఐ స్వాధీనం చేసుకుందని కోహెన్ ప్రతినిధి స్టీఫెన్ రయన్ పేర్కొన్నారు. ఎఫ్ బీఐ పలురకాల సెర్చ్ వారెంట్లను అమలు చేసిందని ఆయన తెలిపారు. కోహెన్ కు - అతని క్లయింట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్ బీఐ స్వాధీనం చేసుకోవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుని వ్యక్తిగత న్యాయవాది కార్యాలయాలపై ఎఫ్ బీఐ దాడి చేసి - అధ్యక్షునికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం విశేషమని పరిశీలకులు పేర్కొంటున్నారు.