Begin typing your search above and press return to search.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ఎఫ్.డీ.ఏ కీలక ప్రకటన
By: Tupaki Desk | 25 April 2020 7:50 AM GMTమలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం కరోనా వైరస్ పై బాగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి భారత్ పై ఒత్తిడి తెచ్చి మరీ వాటిని దిగుమతి చేయించుకున్నారు. అయితే ఈ మందు కరోనాపై అంతగా ప్రభావం చూపడం లేదని తర్వాత తెలిసింది. తాజాగా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీ ఏ) కీలక ప్రకటన చేసింది. ఈ ఔషధం ఉపయోగిస్తే కరోనా రోగులకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
కరోనాపై హైడ్రాక్సీ క్లోరోక్విన్ పని చేస్తుందని ఎక్కడా ప్రయోగం చేయలేదని.. దీనిని ఎక్కువగా వాడడం వల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఎఫ్.డీ.ఏ స్పష్టం చేసింది. దీంతో గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని హెచ్చరించింది.
అమెరికాలో కరోనా వైరస్ సోకి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ఇవ్వాలని తెలిపామని ఎఫ్.డీ.ఏ పేర్కొంది. కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి స్థానిక వైద్యులే ఏమందు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
కరోనా వైరస్ నియంత్రణకు ఇంత వరకు మందు లేదని ఎఫ్.డీ.ఏ తెలిపింది. ప్రయోగాలు జరుగుతున్నాయని.. త్వరలోనే మందు కనుగొంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఇదే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును కరోనాకు వాడవచ్చని భారత వైద్య పరిశోధన మండలి అనుమతివ్వడం విశేషం.