Begin typing your search above and press return to search.

వెన్నాడుతున్న..బీజేపీ భయం : ప్రవాసానికి జార్ఖండ్ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   30 Aug 2022 2:31 PM GMT
వెన్నాడుతున్న..బీజేపీ భయం :  ప్రవాసానికి జార్ఖండ్ ఎమ్మెల్యేలు
X
బీజేపీ దేశంలో పాలన చేస్తోంది. అదే టైమ్ లో ప్రాంతీయ పార్టీల మీద కత్తి కట్టేసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ మాత్రం సందు దొరికినా వీలు చూసుకుని వారి మధ్యన చొరబడిపోవడమే. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని బ్రహ్మాండంగా సొమ్ము చేసుకోవడమే. ఇదే బీజేపీ నయా రాజకీయ నీతి. దీంట్లో నియమాలు లేవు,విధానాలు లేవు. గద్దె ఒక్కటే కనిపిస్తుంది. దాంతో టార్గెట్ గట్టిగానే పెట్టుకుని బరిలోకి దిగిపోతోంది.

ఏడాదిన్నర క్రితం బలమైన ప్రభుత్వంగా జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ ముక్తీ మోర్చాకు ఇపుడు ఎక్కడ లేని భయం పట్టుకుంది. దానికి కారణం కమలం పార్టీ అనే అంటున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తనకు ఉన్న విశేష ముఖ్యమంత్రి అధికారులను వాడేసుకుని తన సంస్థలకు సొంత గనులను అక్రమమైన తీరులో కేటాయించుకున్నారు అని వచ్చిన ఆరోపణల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద అనర్హత వేటు వేసే అధికారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ కి ఇచ్చింది. ఆ విధంగా యాక్షన్ తీసుకోమని సిఫార్స్ చేసింది.

అంతే సాఫీగా హాయిగా సాగిపోతున్న జార్ఖండ్ సర్కార్ లో భూకంపం రేగింది. గవర్నర్ రమేశ్ బయాస్ కనుక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఏ క్షణంలో అయినా హేమంత్ మీద అనర్హత వేటు పడుతుంది. ఆ మీదట ఆయన అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అయిపోతారు. దాంతో పొలిటికల్ గా కకావికలం అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని సొమ్ము చేసుకుని అక్కడ సర్కార్ ఏర్పాటు చేయడానికి బీజేపీ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి.

దాంతో ఈ సంగతిని పసిగట్టిన సోరెన్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు చూస్తే నిన్నటిదాకా దర్జాగా ఉన్న వారు అంతా ఇపుడు భయంతో ప్రవాసానికి తరలిపోవాల్సి వస్తోంది. తాను మాజీ సీఎం అయినా తమ పార్టీకి చెందిన వారే తదుపరి సీఎం కావాలన్న ఉద్దేశ్యంతో హేమంత్ శోరెన్ చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ దూకుడు చెక్ పెట్టేలా ఉందని అంటున్నారు. దాంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని ఆయన చూస్తున్నారు.

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని ఆసరాగా తీసుకుని బీజేపీ పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని
సమాచారం పక్కాగా ఉండడంతో సోరెన్ తన పార్టీ ఎమ్మెల్యేల‌ను తీసుకుని రెండు బస్సులలో రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారంతా ప్రత్యేక విమానమలో చత్తీస్ ఘడ్ వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక వీరంతా రాయ్‌పూర్‌లోని మేఫెయిర్ రిసార్ట్‌లో బస చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలియచేస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే జార్ఖండ్ లో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి. అవి గత మూడు రోజులుగా జోరందుకున్నాయి. నిజానికి జార్ఖండ్ రాజధాని దాటకూడదనే మొదట సోరెన్ అనుకున్నారు. దాంట్లో భాగంగా రెండు రోజుల పాటు రాంచీ సమీపంలోని కుంతిలో సోరెన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు 43 మంది ఉన్నారు. కానీ సీన్ పూర్తిగా అర్ధమైపోవడంతో ఆయన రాయపూర్ దిశగా తన ఎమ్మెల్యేలతో కొత్త క్యాంప్ కి తరలివెళ్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా జార్ఖండ్ సీఎం సోరెన్ తన ఎమ్మెల్యే పావికే కాదు, సీఎం పదవికి తానుగా రాజీనామా చేయాలని సర్కార్ ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 82 అయితే జార్ఖండ్ ముక్తీ మోర్చాకు 50 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీకి చెందిన మంత్రి చెబుతున్నారు. ఇక బీజేపీకి కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. మరి కుర్చీ దక్కడానికి మ్యాజిక్ నంబర్ ఇక్కడ చూస్తే 42గా ఉంది. అంటే బీజేపీకి మరో పదహారు మంది ఎమ్మెల్యేలు అవసరం పడతారు అన్న మాట.

దాంతో సోరెన్ పార్టీలో అనిశ్చితి తేవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నరు. అసెంబ్లీ రద్దు, ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలు ఆ వైపు నుంచి ఈ వైపునకు టర్న్ అవుతారన్న ఆలోచనలు కూడా బీజేపీలో ఉన్నాయని అంటున్నారు. దీని మీద జార్ఖండ్ మంత్రి మిథిలేష్ ఠాకూర్ మాట్లాడుతూ రిసోర్ట్స్ రాజకీయాలు తాము బీజేపీ నుంచే నేర్చుకున్నామని, తమ పార్టీని చీల్చే చాన్స్ లేదని అంటున్నారు. ఇక జేఎంఎం తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా కాపాడుకుంటూ సోన్రెన్ చేస్తున్న ప్రయత్నాలు ఇపుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. మొత్తానికి జార్ఖండ్ లో రాజకీయ క్రీడ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఎవరు నెగ్గుతారు అంతే వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.