Begin typing your search above and press return to search.

అచ్చెన్న వీడియోలోని వ్యక్తికి ప్రాణభయం.. ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   14 April 2021 6:13 PM IST
అచ్చెన్న వీడియోలోని వ్యక్తికి ప్రాణభయం.. ఫిర్యాదు!
X
అచ్చెన్నాయుడు ఓ టీడీపీ నేతతో జరిపిన అంతరంగిక సంభాషణ ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో తనపై రాళ్లదాడి జరిగిందని సానుభూతి పొందాలనుకున్న బాబుకు ఈ వీడియో శరాఘాతంగా మారింది. చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఇప్పుడు అచ్చెన్న వీడియో ఇబ్బందికరంగా మారిందట..

అచ్చెన్నా.. మరో టీడీపీ నేత టీడీపీలో భవిష్యత్ లేదని.. లోకేష్ ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని అన్నట్టున్న వీడియో బయటడడం పార్టీ భవిష్యత్ ను గందరగోళంలో పడేసిందన్న చర్చ సాగుతోంది.

ఈ వీడియో బయటపడడంతో అచ్చెన్నతో మాట్లాడిన వీడియోలో లోకేష్ గురించి అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆకుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వెంటనే తిరుపతి వెస్ట్ పోలీసులను ఆవ్రయించాడు. తనకు టీడీపీ నుంచి చంద్రబాబు నుంచి ప్రాణాహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అచ్చెన్నతో తాను జరిపిన వీడియో లీక్ అయినప్పటి నుంచి తనకు టీడీపీ ముఖ్య నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జూబ్లిహిల్స్ నుంచి కార్పొరేటర్ గా పోటీచేశానని తెలిపారు. 30 ఏళ్లుగా తాను టీడీపీలో కష్టపడి పనిచేశానన్నాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు అత్యంత సన్నిహితుడైన కేఎల్ నారాయణ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ లోని 400 గజాల స్థలాన్ని కబ్జా చేశాడని ఆకుల వెంకటేశ్వరరావు ఆరోపించారు. దీనిపై చంద్రబాబుకు, బాలకృష్ణకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే విషయంపై అచ్చెన్నాయుడితో మొర పెట్టుకున్నానని వీడియోలో అది రికార్డ్ అయ్యిందని బాధితుడు వెంకటేశ్వరరావు తెలిపారు.