Begin typing your search above and press return to search.

'టీకా'తో మృత్యుభయం తొలగింది : ఎయిమ్స్ !

By:  Tupaki Desk   |   5 Jun 2021 9:53 AM GMT
టీకాతో మృత్యుభయం తొలగింది : ఎయిమ్స్ !
X
కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే తాజాగా వ్యాక్సినేషన్ అంశంపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంతృప్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వాళ్లలో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఎయిమ్స్ అధ్యయనం.

వ్యాక్సిన్ తో కరోనా మృత్యుభయం ఉండదని గుర్తించారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారిలో తీవ్ర లక్షణాలు ఉండడం లేదని, విషమ పరిస్థితులు కనిపించడంలేదని ఎయిమ్స్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ పొందిన తర్వాత కరోనా సోకిన 63 మంది బాధితులపై ఈ అధ్యయనం చేపట్టారు. వారిలో 36 మంది రెండు డోసులు పొందగా, 27 మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. అలాగే వారిలో 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వేయించుకున్నారు. కాగా, వారికి కరోనా సోకినప్పుడు పరీక్ష చేయగా, వారి శాంపిళ్లలో వైరల్ లోడ్ ఎక్కువగానే కనిపించింది. వీరిలో వ్యాక్సిన్ తీసుకోని కరోనా రోగుల మాదిరే జ్వరం కూడాఐదు నుంచి ఏడు రోజుల పాటు కనిపించినప్పటికీ..ఆ లక్షణాలేవీ బాధితులను ఇబ్బంది పెట్టేంత స్థాయిలో లేవని గుర్తించారు.

గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 1.20లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు రెండు నెలల కనిష్టానికి కేసుల సంఖ్య చేరింది. నిన్న కొత్తగా 1,20,529 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 3,380 మంది మరణించారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879 కి పెరగగా, మరణాల సంఖ్య 3,44,082 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.నిన్న ఈ మహమ్మారి నుంచి 1,97,894 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,55,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి.