Begin typing your search above and press return to search.
డెంగ్యూ భయం.. తెలంగాణలో డేంజర్ బెల్స్
By: Tupaki Desk | 10 Sep 2022 12:34 PM GMTతెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే వందల మంది చనిపోయారు. రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. చాలా మంది డెంగ్యూ కారణంగా ప్లేట్ లెట్స్ పడిపోయి ఆస్పత్రుల పాలవుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అందరినీ భయపెడుతోంది. దాని కారణంగా ప్టేట్ లెట్లు పడిపోతున్నాయి. అవి పడిపోతే చనిపోవడం గ్యారెంటీ..
ఈ సెప్టెంబర్ మొదటి నాలుగురోజుల్లోనే ఏకంగా 599మందికి జ్వరం సోకడం.. అది డెంగ్యూగా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 4వ తేదీ వరకూ 6151 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆగస్టులోనే 3602 కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలా వరకూ ్రభుత్వం దృష్టికి రావడం లేదు. దీంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. రికార్డ్ స్థాయిలో 2998 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్ లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 కేసులు నమోదయ్యాయని నివేదిక తేల్చింది. ఈ వర్షాకాలం అత్యధిక వర్గాల వల్ల ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.
ప్రధానంగా చూస్తే డెంగ్యూ సోకితే ప్లేట్ లెట్స్ పడిపోతాయి. నాలుగైదు రోజుల పాటు ఆస్పత్రుల్లోనే వాటిని ఇంజెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం డెంగీ అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు 20912 డెంగీ నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను సరఫరా చేసింది. మరో 6501 కిట్లను సిద్ధంగా ఉంచింది. అన్ని జిల్లాలకు మలేరియా నిర్ధారణకు అవసరమైన 5.25 లక్షల ఆర్జీటీ కిట్లను పంపించింది.
*ప్లేట్ లెట్స్ ఏం చేస్తాయి.?
ప్లేట్ లెట్స్ అంటే రక్తంలో ముఖ్య భూమిక పోషించే కణాలు. ఇవి కణజాలాల మరమ్మతుకు, దెబ్బలు తగిలినచోట రక్తం గడ్డకట్టడానికి, పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడుతాయి. డెంగ్యూ వచ్చిన వారికి ప్రధానంగా ఈ ప్లేట్ లెట్స్ పడిపోతాయి. దాంతో మరణం సంభవిస్తుంది.
*ప్లేట్ లెట్స్ పెరగాలంటే ఏం తినాలి?
ప్లేట్ లెట్స్ పెరగడానికి సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్లేట్ లెట్స్ పెరగడానికి బొప్పాయి దివ్యౌషధం. బొప్పాయి ఆకుల్లో ఎన్నో ప్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నా వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుందని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు.
ఇక ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లేట్ లెట్స్ పెరగడానికి దోహదపడుతాయని న్యూట్రీషనిస్లులు చెబుతున్నారు.
గుమ్మడి కాయ ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది. గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకున్నా కౌంట్ పెరుగుతుంది. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తీసుకున్నా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.