Begin typing your search above and press return to search.
మళ్లీ లాక్ డౌన్ భయాలు.. మొత్తానికి క్లారిటీ వచ్చేసింది
By: Tupaki Desk | 4 Jan 2022 4:08 AM GMTప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ లలో కేసులు విపరీతంగా పెరిగి లాక్ డౌన్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ పట్ల దేశంలోనూ ఆందోళన మొదలైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూఇయర్ వేళ ఆంక్షలు పెట్టారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేశారు. ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇఛ్చారు. అదే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో 99శాతం బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చుతున్నట్టు తెలిపారు. త్వరలోనే 100శాతం ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు.
ఇక హోం ఐసోలేషన్ కిట్లను 20లక్షల నుంచి ఒక కోటి అందుబాటులోకి తేవాలని కేసీఆర్ ఆదేశించారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లను సేకరించాలని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో చెప్పారు. తక్షణమే ఆరోగ్యశాఖలో ఉన్న భర్తీలను పూర్తి చేయాలన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటు చేయాలన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్యసేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇక హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని.. అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బస్తీ దవాఖానాలను మంజూరు చేశారు. కరీంనగర్ 2, జగిత్యాల, సూర్యపేట, సిద్దిపేటలో ఒక్కోటి చొప్పున, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండం, ఖమ్మం లలో రెండు చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు కానున్నాయి.
ఇక మిగతా జిల్లా కేంద్రల్లో ఒక్కో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.