Begin typing your search above and press return to search.
బాలయ్యలో భయం మొదలైందా.?
By: Tupaki Desk | 13 May 2019 6:14 AM GMTబాలయ్యలో భయం మొదలైందా. ఈసారి ఎన్నికల్లో తాను ఓడిపోతాననే విషయం బాలయ్యకు అర్థమైందా అంటే ఔననే అంటున్నారు కొంతమంది ఔత్సాహికులు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని గుళ్లూ గోపురాలను బాలయ్య వరుసబెట్టి చుట్టేస్తున్నాడని అంటున్నారు. నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో మహిమాన్వితమైన తలుపులమ్మ లోవ ఆలయాన్ని సందర్శించారు బాలయ్య. ఇక ఇవాళ.. తుని దగ్గర గెడ్లబిడు వద్ద దారలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొన్నటి ఎన్నికల్లో గెలుపు కోసం బాలయ్య బాగానే కష్టపడ్డారు. కానీ హిందూపురానికి మంచినీటి సరఫరాను అందించడంలో ఆయన పూర్తిగా వైఫల్యం చెందారని అక్కడి స్థానిక ప్రజలే అంటున్నారు. ఇక బాలయ్య పీఏ చేసిన అరాచకాల గురించి, వసూళ్లపర్వం గురించి అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దీనికితోడు వైసీపీ అభ్యర్థి గట్టివాడు కావడంతో.. అతనికే ప్రజలు ఎక్కువసంఖ్యలో మద్దతు తెలుపడంతో.. బాలయ్య ఓటమి ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. దీంతో.. బాలయ్య ఓడిపోతాననే భయంతోనే ఆలయాలు దర్శిస్తున్నారనేవాళ్లు లేకపోలేదు. 2014 పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు… హిందూపురంలో బాలయ్య గెలుపు అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గెలుపోటముల్ని పక్కనపెడితే.. బాలయ్య తూర్పుగోదావరి జిల్లాలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఏ ప్రాంతం వెళ్లినా అక్కడి దేవాలయాల్ని దర్శించడం బాలయ్యకు అలవాటు. బాలయ్యకు దైవభక్తి ఎక్కువని అందరికి తెలిసిందే. అలా తూగోలోని ఆలయాల్ని దర్శిస్తున్నారు తప్ప ఓడిపోతాననే భయం కాదని అంటున్నాయి టీడీపీ వర్గాలు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికి మే 23 వరకు టెన్షన్ తప్పేట్లు లేదు.
కొసమెరుపు - అయితే, బాలయ్య పూజలు తనకోసం మాత్రమే కాదట, తనతో పాటు తన ఇద్దరు అల్లుళ్లు గెలిస్తే అది చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోతుందని... ముగ్గురి పేరున పూజలు చేయించినట్లు చెబుతున్నారు. అల్లుళ్లంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలిగా మరి.