Begin typing your search above and press return to search.

చావు బతుకుల మధ్య కిమ్ జాంగ్..నిజమెంత?

By:  Tupaki Desk   |   21 April 2020 7:50 AM GMT
చావు బతుకుల మధ్య కిమ్ జాంగ్..నిజమెంత?
X
ప్రపంచమంతా ప్రజాస్వామ్యంతో పరిఢవిల్లుతుంటే ఉత్తరకొరియాలో మాత్రం అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంతలా దేశాన్ని పట్టి పాలిస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి దూరంగా ప్రజలను నియంతలా అణిచేస్తున్నాడు. ఆయన ఆకృత్యాలపై ఎన్నో కథనాలు వెలుగుచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ నియంతతో చర్చలు జరిపి ఊరుకున్నాడు.

*చావుబతుకుల మధ్య కిమ్ జాంగ్?

తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిసింది. ఇటీవలే ఆయన చేయించుకున్న గుండె సర్జరీ తిరగబెట్టిందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోందట.. దీనికి సీఎన్ ఎన్ కథనం కూడా బలాన్ని ఇస్తోంది.

*అనుమానాలకు కారణాలవీ..

ఈనెల 15న ఉత్తర కొరియా జాతి పిత కిమ్ 2 సంగ్ జయంతి వేడుకలు జరిగాయి. ఉత్తరకొరియా ఆవిర్భావానికి ఆయనే ఆద్యుడు. ప్రస్తుతం నియంత కిమ్ జాంగ్ కు తాత. ఈయన జయంతిని ఉత్తరకొరియా అంతటా పండుగలా స్వాతంత్ర్యం దినోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా హాజరయ్యే కిమ్ జాంగ్ ఈ ఏడు జయంతిలో పాల్గొనక పోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్త వెలుగుచూసింది. ఈనెల 12న దక్షిణకొరియా వార్త సంస్థలు కూడా కిమ్ జాంగ్ గుండె శస్త్ర చికిత్స ఫెయిల్ అయ్యిందని సీరియస్ గా ఉన్నాడని కథనాలు రాశాయి.

*కిమ్ కు సోకిన వ్యాధి ఏంటి?

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ‘కార్డియో వాస్కులర్’కు గురయ్యారని తెలిసింది. ఆయన విపరీతంగా పొగతాగడం.. భారీ శరీరం కావడం వల్ల ఈ గుండె వ్యాధి వచ్చిందని.. ఇటీవలే సర్జరీ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని.. పరిస్థితి సీరియస్ గానే ఉందని వార్తలు వచ్చాయి. అధికారులు ఈ వార్తను బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట..

*ఈనెల 11 నుంచి కిమ్ జాంగ్ అజ్ఞాతంలోకి..

ఈనెల 11 నుంచి దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎలాంటి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం లేదు. అంతకుముందే ఆయనకు గుండె సర్జరీ జరిగింది. దీంతో ఆరోగ్య పరిస్థితి దిగజారడం వల్లే ఆయన బయటకు రావడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.

*సీఎఎన్ కథనంతో కలకలం

తాజాగా ఉత్తరకొరియా నియంత చావుబతుకుల మధ్య ఉన్నాడని అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ ఎన్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తోంది. ఆయన గుండె ఆపరేషన్ తిరగబెట్టిందని.. చావుబతుకుల మధ్య ఉన్నాడని కథనం ప్రసారం చేసింది. అయితే ఈ వార్తను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు - ఉత్తరకొరియా అధికారిక మీడియా ఖండించింది. ఆయన కోలుకుంటున్నారని వెల్లడించాయి.