Begin typing your search above and press return to search.
ట్రంప్ కు షాకిచ్చింది ఒక మహిళా జడ్జి!
By: Tupaki Desk | 29 Jan 2017 9:20 AM GMTఎవరైనా సరే.. లైట్ తీసుకుంటూ.. నచ్చనోళ్ల మీద విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తొలి షాక్ తగిలింది. ఎంత అమెరికా అధ్యక్షుడే అయినా.. అతనికి కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయాన్ని తెలిసేలా చేసిన వైనం తాజాగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా చులకనగా చూసే మహిళే.. తాజాగా ట్రంప్ జారీ చేసిన ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. స్త్రీని చులకనగా చూస్తూ.. విర్రవీగే ట్రంప్ లాంటి మగాడికి చట్టంతో ముకుతాడు వేసింది ఒక మహిళ కావటం విశేషంగా చెప్పాలి.
మెజార్టీ ముస్లింలు ఉన్న ఏడు దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాలోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకొని ప్రపంచానికి షాకిచ్చిన ట్రంప్ కు మహిళా జడ్జి ఒకరు దిమ్మ తిరిగిపోయేలా చేశారు.ఆయన ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు ఇవ్వటమే కాదు.. తన ఆదేశాలు అమెరికా వ్యాప్తంగా అమలు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. మరి.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న మహిళ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి.
అమెరికా న్యాయవ్యవస్థ ఎంత బలమైనదన్న విషయాన్ని అపర కుబేరుడు ట్రంప్ కు తెలియజేసిన మహిళా న్యాయమూర్తి పేరు ఎన్ డొనెల్లీ. మిచ్ గాన్ లోని రాయల్ ఓక్ ప్రాంతానికి చెందిన ఆమెకు న్యాయశాస్త్రంలో మంచి పట్టు ఉందన్న పేరుంది. నాటర్ డ్యామ్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.. ఓహియో కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె.. రైట్‌స్టేట్ యూనివర్సిటీలో పదేళ్లు ప్రొఫెసర్ గా పని చేశారు.
సుమారు పాతికేళ్ల పాటు న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసులో అసిస్టెంట్ డిస్ట్రిక్ అటార్నిగా పని చేసిన ఆమె.. ఫెడరల్ జడ్జిగా పని చేస్తున్నారు. 2015లో హైప్రొఫైల్ డెమోక్రాటిక్ సెనేటర్ చార్లెస్ స్చూమెర్ సలహా మేరకు డొనెల్లీని మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా తన పదవీ కాలంలో నియమించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/