Begin typing your search above and press return to search.

11 మంది భారత విద్యార్ధుల అరెస్టు

By:  Tupaki Desk   |   23 Oct 2020 3:00 PM GMT
11 మంది భారత విద్యార్ధుల అరెస్టు
X
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న భారతీయ విద్యార్ధుల్లో 11 మందిని ఫెడరల్ లా ఎన్ఫోర్సుమెంటు పోలీసులు అరెస్టు చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్ధుల విషయంలో అమెరికా పోలీసులు రెగ్యులర్ గా విచారణ చేయిస్తునే ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్ధుల అక్రమ నివాసంపై ఆరాలు తీసినపుడు 15 మంది విదేశీ విద్యార్దులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 11 మంది భారతీయ విద్యార్ధులున్నారని తేలింది.

మామూలుగా అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళిన విద్యార్ధులు చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగంలో చేరాలి. లేకపోతే తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాలి. కానీ పై 15 మంది విద్యార్ధులు మాత్రం తమ చదవు అయిపోయినా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటీ) అనే ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలోనే ఉండిపోయారట. విద్యార్ధులు తాము చదివిని చదువుకు సంబంధించిన ఉద్యోగంలో ఓపీటీలో భాగంగా ఏడాది పాటు పనిచేయచ్చు. ఇదే సమయంలో స్టెమ్ ఓపీటీలో పాల్గొంటే అదనంగా మరో 12 నెలలుండవచ్చు.

కానీ పట్టుబడిన 15 మంది విద్యార్ధులు ఎక్కడా ఉద్యోగాలు చేయకుండానే ఏపీటీ వెసులుబాటును అడ్డం పెట్టుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఎన్ఫోర్సుమెంటు అధికారులు పసిగట్టారు. తమ చట్టాల ప్రకారం పట్టుబడిన విద్యార్ధులపై తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా పోలీసులు చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.