Begin typing your search above and press return to search.
`యోగి`కి మోకరిల్లిన సీఐ....వైరల్!
By: Tupaki Desk | 28 July 2018 11:29 AM GMT2014లో నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దేశంలో స్వాములు - మఠాధిపతులు....గతంలో కంటే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను నియమించడంపై విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే దళితుల ఇళ్లకు ఆదిత్యనాధ్ వెళ్లేముందు ...అధికారులు చేసిన`సబ్బు`హడావిడి అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హిందూమత ప్రచారకుడిగా కూడా ఉన్నసీఎం యోగి....తాజాగా గోవుల ప్రాణాలే ముఖ్యమంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీలో జరిగిన తాజా ఘటన కలకలం రేపింది. గురుపూర్ణిమ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగికి...ఓ సీఐ యూనిఫామ్ లో మోకరిల్లడం....సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శుక్రవారం నాడు గురుపూర్ణిమ సందర్భంగా యూపీలోని గోరఖ్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ ఆలయ పెద్ద హోదాలో సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరయ్యారు. అయితే, అదే కార్యక్రమానికి ....సీఎం భద్రత కోసం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఆ ఆలయ పెద్ద అయిన యోగి నుంచి ప్రవీణ్ ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా,‘ఫీలింగ్ బ్లెస్స్‌డ్’ అంటూ ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో, ప్రవీణ్ పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆ యూనిఫాంకు ఓ గౌరవం ఉందని, యూనిఫాం వేసుకొని ఆ పని చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు ? అసలు నీకు సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్.. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివేనా? అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, తాను సీఎం హోదాలో ఆయనను గౌరవించలేదని, ఆలయ పెద్దగా మాత్రమే పూజ చేశానని ప్రవీణ్ బదులిచ్చారు.