Begin typing your search above and press return to search.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కి ఫీజులివే ... జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్ ...

By:  Tupaki Desk   |   23 Jun 2021 10:44 AM GMT
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కి  ఫీజులివే ... జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్ ...
X
రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ మహమ్మారి చికిత్స, టెస్టులకు ధరలను తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 401ని తాజాగా వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. మాములు వార్డులో ఐసోలేషన్, కరోనా వైరస్ మహమ్మారి పరీక్షలకు రోజుకు రూ. 4 వేలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అలాగే ఐసీయూ గదిలో రోజుకు రూ. 7,500గా ఫిక్స్ చేసింది . ఇక వెంటిలేటర్‌ తో కూడిన ఐసీయూ గదికి రోజుకు రూ. 9 వేలు వసూలు చేయాలని నిర్ణయించింది.

కాగా, కరోనా టెస్టులకు సంబంధించిన రేట్లను ఒకసారి చూస్తే ..

పీపీఈ కిట్ – రూ. 273
హెచ్ఆర్‌ సీటీ- రూ. 1995
డిజిటల్ ఎక్స్‌రే- రూ. 1300
ఐఎల్6- రూ. 1300
డీడైమర్- రూ. 300
సీఆర్‌ పీ- రూ. 500
ప్రొకాల్ సీతోసిన్- రూ. 1400
ఫెరిటీన్- రూ. 400
ఎల్‌ డీహెచ్- రూ. 140, ఇదిలా ఉంటే సాధారణ అంబులెన్స్‌ కు కిలోమీటరుకు రూ. 75గా, కనీస ఛార్జీ రూ. 2 వేలు మించరాదు. అటు వసతులతో కూడిన అంబులెన్స్‌ కు కిలోమీటరుకు రూ.125, మినిమం ఛార్జ్ రూ. 3 వేలుగా నిర్ణయించింది. మరి ఇంత కాలం లక్షలకు లక్షలు దోపిడీ చేసిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం తాజా నిర్ణయంతోనైనా తమ వైఖరి మార్చుకుంటాయా.. లేక అదే విధంగా అడ్డగోలు దోపిడీకి తెగబడతాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే , ఈ ధరలపై ప్రైవేట్ హాస్పిటల్స్ స్పందన ఏమిటో తెలియాలి.