Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు ఖాకీల `గుట్టు` ర‌ట్టు చేసిన భ‌ర్త‌!

By:  Tupaki Desk   |   22 Jan 2018 10:56 AM GMT
ఇద్ద‌రు ఖాకీల `గుట్టు` ర‌ట్టు చేసిన భ‌ర్త‌!
X
హైద‌రాబాద్ లో ఇద్ద‌రు ఖాకీల మ‌ధ్య అక్ర‌మ సంబంధం గుట్టు రట్ట‌యింది. ఇద్ద‌రు ఉన్నత స్థాయి పోలీసు అధికారుల మ‌ధ్య ఉన్నవివాహేత‌ర సంబంధం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డం న‌గ‌రంలో క‌ల‌కలం రేపుతోంది. అవినీతి నిరోధ‌క శాఖ‌లో ఏఎస్పీ స్థాయి మ‌హిళా అధికారితో....సీఐ అక్ర‌మ సంబంధం పెట్టుకున్న విష‌యం ఆ మ‌హిళా అధికారి భ‌ర్త‌కు తెలిసింది. దీంతో, న‌గరంలోని ఓ ఇంట్లో ఆ ఇద్ద‌రు ఉన్న స‌మ‌యంలో ఆమె భ‌ర్త రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. అంతేకాకుండా, ఆ సీఐని న‌డిరోడ్డుపై ప్ర‌జ‌లంద‌రి ముందు చిత‌క‌బాదారు. ఆ ఏఎస్పీ భ‌ర్త‌ - త‌ల్లి - అత్త‌య్య‌ - బంధువులు....మూకుమ్మ‌డిగా సీఐపై దాడి చేశారు.

తన భార్యను మాయ‌మాట‌లు చెప్పి సీఐ లొంగ‌దీసుకున్నాడ‌ని, దాదాపుగా రెండేళ్ల నుంచి ఈ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని ఏఎస్పీ భర్త ఆరోపించారు.ఈ విష‌యంపై మ‌న‌స్తాపం చెందిన తాను ఆత్మహత్యకు పాల్ప‌డాల‌ని భావించాన‌ని, తన భార్య , సీఐల గుట్టును ర‌ట్టుచేసి లోకానికి తెలియ‌జెప్పాల‌నే ఉద్దేశంతోనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని తెలిపారు. ఎంతో మంది మ‌హిళ‌ల జీవితాలను ఆ సీఐ నాశనం చేశాడని, ఉన్న‌తాధికారులు స‌త్వ‌ర‌మే స్పందించి అత‌డికి క‌ఠిన శిక్ష విధించాల‌ని ఏఎస్పీ తల్లి - అత్త కోరారు. త‌న కూతురు జీవితాన్ని, కాపురాన్ని ఆ సీఐ నాశనం చేశాడని ఏఎస్పీ తల్లి కంట‌త‌డి పెట్టారు. బాధ్య‌త‌ల‌ను మ‌రచి ఈ నీచానికి పాల్ప‌డ్డ ఆ సీఐపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ భ‌ర్త‌ - కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధ్య‌త గ‌ల ప‌దవిలో ఉంటూ ప‌దిమందికి ఆద‌ర్శంగా ఉండ‌వ‌ల‌సిన పోలీసు అధికారులు ఈ విధంగా ప్ర‌య‌త్నించ‌డంపై ఉన్నతాధికారులు సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.