Begin typing your search above and press return to search.

ఆడవాళ్లలోనే శృంగార కోరికలు ఎక్కువట..

By:  Tupaki Desk   |   11 March 2021 11:30 PM GMT
ఆడవాళ్లలోనే శృంగార కోరికలు ఎక్కువట..
X
మానవ ఆరోగ్య జీవనానికి సెక్స్ ప్రధాన అవసరం. పురుషులైనా.. మహిళలైనా ఆరోగ్యంగా ఉండడానికి సెక్స్ ఎంతో తోడ్పడుతుందని సంబంధిత రంగ వైద్యులే ధ్రువీకరిస్తున్నారు. వివాహితులైన వారిలో సెక్స్ అనేది ఒక భాగం. పెళ్లైన వారు సహజంగా తమకు సెక్స్ అవసరాన్ని ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పెళ్లైన పురుషుడు సెక్స్ అవసరమైనప్పడు తన జీవిత భాగస్వామిని లొంగదీసుకుంటాడు. అయితే ఆ సమయంలో తనకు సెక్స్ అవసరమా లేదని గ్రహించడం కష్టమే. కానీ తన జీవిత భాగస్వామి సెక్స్ కోరుతుందని ఎలా గ్రహించాలి..?

ఎప్పుడూ మగాళ్లకేనా మూడ్ వచ్చింది.. ఆడవాళ్లకు రాదా? వారికి అసలు మూడ్ ఎప్పుడు వస్తుంది? శృంగారం ఎప్పుడు తపిస్తారు? ఇలా ప్రశ్నలు చాలా మంది మగపుంగవులకు వస్తుంటాయి. కానీ ఆడవాళ్ల మనసులు సముద్రమంతా లోతు కావడంతో అంత ఈజీగా బయటపడవు. మనకు నీరు అవసరమైనప్పుడు దాహం వేస్తోంది.. ఆహారం అవసరమైనప్పుడు ఆకలేస్తుంది.. మరి సెక్స్ అవసరమైనప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసా..? అనే దానిపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి.

సాధారణంగా మగవారికి సెక్స్ అవసరం అయినప్పుడు వారి అవయవాల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే మహిళల్లో సెక్స్ అవసరం అయినప్పుడు వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..? వారిలో సెక్స్ లోపం ఉందని ఎలా గుర్తించాలి..?

పురుషుల కంటే స్త్రీలలోనే లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయనేది ఎన్నో సర్వేల్లో స్పష్టమైన సంగతి తెలిసిందే. తాజాగా 30 ఏళ్లలోపు ఉన్న మహిళల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

నిద్రలోనూ వాళ్లు శృంగార కలలు కంటున్నారట.. శృంగారం, దానికి సంబంధించిన విషయాలపై గతంలో కంటే ప్రస్తుతం ఓపెన్ గా మాట్లాడడం.. చర్చించడం లాంటివి మహిళల్లో శృంగార కోరికలు పెరగడానికి కారణంగా సర్వేల్లో తేలింది.

ఇద్దరి మధ్య సెక్స్ శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ద్వారా మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. దీంతో సెక్స్ లో సంతృప్తిగా పాల్గొన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. అది కొరతగా ఉన్నవారు మాత్రం నిద్రలేమితో బాధపడుతారు. లైంగిక కోరిక తలెత్తినప్పడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది వారి అవసరాలను తీర్చడానికి, ఎక్కువ సంతృప్తి పరచడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ సమయంలో సెక్స్ జరగలేకపోతే వారి నిద్రను నాశనం చేస్తుంది.ఇక ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ సెక్స్ లోపం ఉన్నవారిలో మోహం మీద మొటిమలు వచ్చేలా చేస్తుంది. కొందరు ఈ విషయంపై అవగాహన ఉండడంతో వారు ఒంటరిగా ఫీలవుతున్నారు.

అంతేకాకుండా ఎక్కువ కాలం సెక్స్ లోపం ఉంటే తొందరగా వ్యుద్ధాప్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రాను రాను ఒక వ్యాధిలాగా మారనుంది.