Begin typing your search above and press return to search.

ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. లోపలే బిక్కుబిక్కుమంటూ బతుకున్న చైనీయులు!

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 PM GMT
ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. లోపలే బిక్కుబిక్కుమంటూ బతుకున్న చైనీయులు!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి... గత రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అది తన రూపు మార్చుకుని కొత్త కొత్త వేరియంట్లతో దూసుకుపోతోంది. తాజాగా షాంఘై నగరం లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే అక్కడి ప్రభుత్వం ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్ డౌన్ అమలవుతోంది. అయితే దీనిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లౌక్ డౌన్ కారణంగా కోటీశ్వరుడు ఇళ్లలో కూడా.. ఆహారంతో పాటు చాలా మందికి మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. కరోనా బాధతో ఏమో కానీ... ఆకలి బాధతో చనిపోతారేమోననే వార్తలు చాలా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలను బారి కేడ్లతో మూసేసిన అధికారులు, ఇప్పుడు కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయిస్తుంది. దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తమను అవమానించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువుల్ని బంధించి, చుట్టూ ఫెన్సింగ్ వేసినట్లుగా తమ ఇండ్లకు ఫెన్సింగ్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కేవలం బాధితుల మేనని.. నేరస్తులం కాదంటూ తెలుపుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకొని కఠినంగా కాకుండా ప్రేమగా వ్యవహరించాలని కోరుతున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ వేసి మరింత ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతున్నారు.

షాంఘై నగరంలో దాదాపు రెండున్నర కోట్ల మంది పౌరులు నివసిస్తున్నారు. వీళ్లంతా ప్రభుత్వ చర్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి. లాకౌడౌన్ విధించినప్పటికీ... మళ్లీ ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ వేయించడం అంత మంచి పద్దతి కాదని చెబుతున్నారు. అలాగే ప్రజలకు పూర్తి స్థాయిలో వారికి ఆహారం, నీళ్లు, నిత్యావసర సరుకులు వంటివి అందించాలని.. ఆ విషయంలో చైనా ప్రభుత్వం విఫలం అయిందని చెబుతున్నారు.

అయితే కరోనాను తరిమి కొట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం వివరిస్తోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహరం అందిస్తున్నప్పటికీ.. కాస్త ఇబ్బందుల వల్ల అందరికీ చేరువకావట్లేదని, వారికి కూడా అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.