Begin typing your search above and press return to search.
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ముఖ్య నేత కుమార్తె మృతి!
By: Tupaki Desk | 1 Aug 2022 5:47 AM GMTహైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వీటిని నివారించడానికి పోలీసులు, ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలకు పుల్ స్టాప్ పడటం లేదు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్ లోని శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తానియా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తానియా మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా 25 ఏళ్ల తానియా బ్యూటీషియన్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున నాంపల్లి నుంచి పోటీ చేశారు. మంచి పోటీ ఇచ్చి ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
కాగా రోడ్డు ప్రమాదాల్లో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీల పిల్లలు మృతి చెందడం అందరినీ కలచివేస్తుంది. గతంలో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ కుమారులతోపాటు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కుమారుడు, టీడీపీ మాజీ మంత్రి నారాయణ కుమారుడు, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడితో సహా పలువురు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.