Begin typing your search above and press return to search.

పండుగ‌ల క‌న్ఫ్యూజ‌న్ పై క్లారిటీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:03 AM GMT
పండుగ‌ల క‌న్ఫ్యూజ‌న్ పై క్లారిటీ ఇచ్చేశారు
X
పండుగ వ‌చ్చిందంటే చాలు.. అస్ప‌ష్ట‌త‌. క్యాలెండ‌ర్లో ఒక‌లా.. టీవీల్లో మ‌రోలా. ఒక పంచాగక‌ర్త చెప్పిన దానికి భిన్న‌మైన వాద‌న‌ను వినిపించే మ‌రో పంచాంగ‌క‌ర్త‌. ఇలా అదే ప‌నిగా భిన్న వాద‌న‌లు వినిపించేయ‌టంతో ఏ పండుగ‌ను ఎప్పుడు జ‌ర‌పాలో కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఈ క‌న్ఫ్యూజ‌న్ పుణ్య‌మా అని ఏ పండుగ‌ను ఎప్పుడు జ‌రుపుకోవాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకునే ప‌రిస్థితి సామాన్యుడిది.

టెక్నాల‌జీ ఇంత‌గా పెరిగిన రోజుల్లో ఇలాంటి అస్ప‌ష్ట‌త ఏంటి? కోట్లాది మంది ప్ర‌జ‌లు జ‌రుపుకునే పండుగ‌ల విష‌యం ప్ర‌భుత్వాల‌కు ప‌ట్ట‌దా? వారి చొర‌వ‌తో నిపుణుల‌ను.. సిద్దాంతులు.. జ్యోతిష్యులు.. పంచాంగ‌క‌ర్త‌ల్ని ఒక‌చోట కూర్చొబెట్టి పండుగ‌ల లెక్క ఒక కొలిక్కి తేల్చొచ్చుగా అన్న వాద‌న ఈ మ‌ధ్య కాలం వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా హైద‌రాబాద్ లో విద్వ‌త్ స‌భను నిర్వ‌హించారు.

ఈ స‌భ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ప‌లువురు సిద్ధాంతులు.. జ్యోతిష్యులు.. పంచాంగ‌క‌ర్త‌లు కూర్చొని ఏ పండుగ‌ను ఎప్పుడు జ‌ర‌పాల‌న్న‌ది డిసైడ్ చేయ‌టం. రెండు రోజుల పాటు జ‌రిగిన స‌భ నిర్ణ‌యాల్ని తాజాగా వెల్ల‌డించారు. ఈ స‌మావేశంలో వ‌చ్చే ఏడాది జ‌రుపుకోవాల్సిన పండుగ‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేశారు.

వ‌చ్చే (విళంబినామ‌) ఏడాది ముఖ్య పండుగ‌లపై స‌మావేశం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం..

మార్చి 18 ఉగాది

మార్చి25 శ్రీరామ‌న‌వ‌మి (స్మార్తానాం)

మార్చి26 శ్రీరామ‌న‌వ‌మి (వైష్ణ‌వానాం)

ఏప్రిల్ 14 మాస శివ‌రాత్రి

ఏప్రిల్ 18 అక్ష‌య తృతీయ‌

మే 10 శ్రీ హ‌నుమాన్ జ‌యంతి

జులై27 వ్యాస పూర్ణిమ‌.. గురుపూర్ణిమ‌

జులై29 సికింద్రాబాద్ మ‌హంకాళి జాత‌ర‌

ఆగ‌స్టు24 వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం

ఆగ‌స్టు26 రాఖీపూర్ణిమ‌

సెప్టెంబర్ 2 శ్రీకృష్ణాష్ట‌మి (స్మార్తానాం)

సెప్టెంబ‌ర్3 శ్రీకృష్ణాష్ట‌మి (వైష్ణ‌వానాం)

సెప్టెంబర్‌ 13 వినాయక చవితి

అక్టోబర్ 17 దుర్గాష్టమి

అక్టోబర్ 18 విజయదశమి

నవంబర్ 6 దీపావళి

నవంబర్ 23 కార్తీక పూర్ణమి

2019

జనవరి 14 భోగి

జనవరి 15 సంక్రాంతి

జనవరి 16 కనుమ

ఫిబ్రవరి 12 రథ సప్తమి

మార్చి 4 మహా శివరాత్రి

మార్చి 19 కామదహనం (దక్షిణాది వారికి)

మార్చి 20 కామదహనం (ఉత్తరాది వారికి)

మార్చి 21 హోళి