Begin typing your search above and press return to search.
ఏపీలో ఉద్యోగాల దందా..రూ.200కోట్లు వసూళ్లు?
By: Tupaki Desk | 18 July 2020 12:30 PM GMTఏపీలో నిరుద్యోగుల నుంచి రూ.200 కోట్ల వసూళ్లు జరిగినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ కొలువులను ఎమ్మెల్యేలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి. దాదాపు 12000 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతం బాగుంటుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని తెలిసి నిరుద్యోగుల నుంచి వీటికి డిమాండ్ అధికంగా ఉంది.
నిరుద్యోగులు ఎగబడుతుండడంతో కొందరు ఎమ్మెల్యేలు దీన్ని క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కొలువును రూ.10లక్షలకు అమ్ముకున్నారని.. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం కలకలం రేపుతోంది.
ఏపీ సీఎం జగన్ ఇలాంటి కాంట్రాక్ట్ పోస్టుల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఇప్పటికే హెచ్చరికలు పంపారు. మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు సూచించారు. అయినా కూడా జగన్ మాటలను కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టినట్టు ప్రచారం సాగుతోంది.
ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని అప్పట్లో ఆదేశించారు.
అయితే ఒక్కో నిరుద్యోగి నుంచి వసూలు చేసిన రూ.10లక్షలు తిరిగి ఇవ్వలేదని సమాచారం. పోస్టులు భర్తీ చేస్తామంటూ డబ్బులు తీసుకున్న వారు ఏమారుస్తున్నట్టు సమాచారం.నిరుద్యోగుల నుంచి సదురు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడం.. ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.
అయితే ఈ ఒత్తిడి భరించలేక..సబ్ స్టేషన్లలో ఉన్న ఉద్యోగులను సైతం తొలగించి ఈ కొత్త వారికి నెల్లూరు జిల్లాలో ఇవ్వడం వివాదాస్పదమైంది. దాదాపు 15మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని పెట్టడంపై సీఐటీయూ, తీసేసిన ఉద్యోగులు ఆందోళన చేశారు..ఈ తాజా ఆందోళనతో ఈ అమ్యామ్యాల వ్యవహారం చర్చనీయాంశమైంది.