Begin typing your search above and press return to search.
రొనాల్డోను కొన్నందుకు బంద్ చేస్తారట
By: Tupaki Desk | 13 July 2018 6:02 AM GMTఈ తరంలోనే కాదు.. మొత్తం ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత ఆకర్షణ కలిగిన.. విలువైన ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకడు. క్లబ్ ఫుట్ బాల్ లో అతడి సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అద్భుత విన్యాసాలతో ఎన్నోసార్లు రియల్ మాడ్రిడ్ జట్టును గెలిపించాడతను. ఆ క్లబ్ కు ఎన్నో టైటిళ్లు అందించాడు. సుదీర్ఘ కాలం ఆ క్లబ్ తో కొనసాగిన రొనాల్డో ఇటీవలే.. దానికి టాటా చెప్పేశాడు. జువెంటస్ క్లబ్ కు మారాడు. ఇందుకోసం ఆ క్లబ్ బదిలీ ఫీజు కింద ఏకంగా 130 మిలియన్ యూరోలు వెచ్చించింది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్స్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఇదొకటి. ఈ డీల్ విషయంలో అటు క్లబ్ నిర్వాహకులు.. ఇటు రొనాల్డో.. ఇరువురూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ డీల్ పట్ల ఫియట్ కార్ల సంస్థ కార్మికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జువెంటస్ క్లబ్.. రొనాల్డోకు అంత రేటు పెడితే ఫియట్ సంస్థ కార్మికులకు అభ్యంతరం ఏంటి అనిపించవచ్చు. ఐతే ఈ క్లబ్.. జువెంటస్ క్లబ్ యాజమాన్యంలో భాగస్వామి. క్లబ్ లో ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఐతే ఒక్క ఆటగాడి కోసం అంత భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని సంస్థ కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దీని బదులు ఆ డబ్బుతో కొత్త ప్లాంటు పెట్టి మరింత మందికి ఉపాధి కల్పించవచ్చు కదా.. కార్మికుల కోసం ఇంకేమైనా చేయొచ్చు కదా అని వారంటున్నారు. తామ రేయింబవళ్లు కష్టపడి సంస్థను ఈ స్థాయికి తెస్తే డబ్బులన్నీ ఇలా తగలెడతారా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఒక్కటైన కార్మికులు వారం రోజుల పాటు పని మానేసి బంద్ చేయడానికి సిద్ధపడిపోయారు. జులై 15 నుంచి వారం పాటు సమ్మె చేయబోతున్నట్లు ఫియట్ కార్మికులు ప్రకటించారు. మరి దీనిపై ఫియట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.