Begin typing your search above and press return to search.

తన చావు గురించి చెప్పిన విప్లవ యోధుడు

By:  Tupaki Desk   |   21 April 2016 7:45 AM GMT
తన చావు గురించి చెప్పిన విప్లవ యోధుడు
X
క్యూబా విప్లవ యోధుడు ఫెడరల్ క్యాస్ట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి మినహాయింపు కాని మరణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు అందరి నోటా చర్చగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీకి వీడ్కోలు పలుకుతూ ఆయన ప్రసంగించిన సందర్భంలో తన మరణం గురించి వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తనకు 90 ఏళ్లు వస్తాయని.. అందరికి అంతిమ సమయం ఆసన్నమైనట్లే.. తనకూ అంతిమ ఘడియలు ఆసన్నమైనట్లేనని చెప్పుకొచ్చారు. తన చావుపై మాట్లాడే నిషేధం ఏమీ లేదన్న ఆయన.. తన ఆఖరి సందేశం ఇదేనని చెప్పటం గమనార్హం. చిత్తశుద్ధితో పోరాడితే ప్రజల అవసరాలు తీర్చే అవకాశం ఉంటుందని.. అలుపెరగకుండా పోరాడాలంటూ పిలుపునిచ్చారు.

2006లో తీవ్ర అనారోగ్యంతో పార్టీ కార్యదర్శి పదవితోపాటు.. క్యూబా దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాస్ట్రో.. ఆ బాధ్యతల్ని తన తమ్ముడికి అప్పగించటం తెలిసిందే. ఒక విప్లవ యోధుడి నోట చావు మాట వినటం.. ఆయన్ను విపరీతంగా అభిమానించే వారందరిని తీవ్రంగా కలిచి వేసిందని చెప్పొచ్చు.