Begin typing your search above and press return to search.

చనిపోయాక కూడా ట్రంప్ వదల్లేదు

By:  Tupaki Desk   |   27 Nov 2016 4:12 AM GMT
చనిపోయాక కూడా ట్రంప్ వదల్లేదు
X
ఈ ప్రపంచంలో ఎవరైనా.. ఎలాంటి వారైనా.. తమకేమాత్రం నచ్చని వ్యక్తుల్ని.. తాము తీవ్రంగా అసహ్యించుకునే వారు హటాత్తుగా మరణించారన్న విషయం తెలిసిన వెంటనే షాక్ తింటారు. అరే.. చనిపోయారే అని అనుకుంటారే కానీ.. ఆ విషయాన్ని కసి తీర్చుకున్నట్లుగా చెప్పరు. అగ్రరాజ్య దురహంకారం ఎంతలా ఉంటుందన్నది తాజాగా ఉదంతం ఇట్టే చెప్పేస్తుంది. తన విధానాలతో అగ్రరాజ్యానికి కంట్లో నలుసులా మారటమే కాదు.. ఒక దశలో ఉక్కిరిబిక్కిరి చేసిన మొనగాడిగా క్యూబా మాజీ అధినేత ఫిడెల్ క్యాస్ట్రోను పలువురు అభివర్ణిస్తారు.

అమెరికాలాంటి అగ్రరాజ్యంతో సుదీర్ఘ కాలం పెట్టుకోవటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ.. అందుకు సిద్ధం కావటమే కాదు..ఆ కారణంగా తనకు.. తన దేశానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం మీద స్పష్టత ఉన్నా.. తన మొండితనంతో.. తన విధానాలతో అగ్రరాజ్యానికి కంటి మీద కనుకు లేకుండా చేయటంలో క్యాస్ట్రో విజయం సాధించారనే చెప్పాలి.

అమెరికా పొడ ఏ మాత్రం గిట్టని క్యాస్ట్రో.. ఆగ్రరాజ్యంపై తన ధిక్కార స్వరాన్ని వినిపించి ప్రపంచాన్నే మైమరిపించారు. అలాంటి పోరాట యోథుడి మరణం ఒక షాక్ లా మారిన పరిస్థితి. ఇలాంటి వేళ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు (అధికారికంగా అధ్యక్ష పదవిని జనవరిలో చేపడతారు)డోనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు కాసింత విచిత్రంగానే ఉందని చెప్పాలి.

అమెరికాకు చుక్కలు చూపించిన ఒక పోరాట యోధుడి మరణాన్ని.. ట్రంప్ చూసిన కోణం.. దానిపై స్పందించిన తీరు చూస్తే.. అమెరికా అధ్యక్ష పదవిని ఎలాంటి వ్యక్తి చేపట్టనున్నారన్న విషయం ఇట్టే అర్థం అయ్యే పరిస్థితి. తెంపరితనం.. అమెరికా ప్రయోజనాల పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరించే ట్రంప్.. క్యాస్ట్రో మరణాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో ఎలాంటి ట్వీట్ చేశారో తెలుసా? ‘‘ఫిడెల్ క్యాస్ట్రో ఈజ్ డెడ్’’ అంటూ పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. చనిపోయిన వ్యక్తిని వదలని రీతిలో.. తనకేమాత్రం ఇష్టం లేని వ్యక్తుల విషయంలో మర్యాద అన్నది మచ్చుకు కూడా ప్రదర్శించని వైనాన్ని ట్రంప్ తేల్చేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/