Begin typing your search above and press return to search.

ఫిడెల్ కాస్ట్రో కుమారుడి ఆత్మహత్య

By:  Tupaki Desk   |   2 Feb 2018 8:11 AM GMT
ఫిడెల్ కాస్ట్రో కుమారుడి ఆత్మహత్య
X
ప్రపంచ ప్రఖ్యాత విప్లవకారుడు - క్యూబా దివంగత అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కుమారుడు పెద్ద కుమారుడు ఫిడెల్ ఏంజెల్ కాస్ట్రో దియాజ్ బలార్డ్ అలియాస్ ఫిడెలిటో ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా డిప్రషన్ తో బాధపడుతున్న 68 ఏళ్ల ఫిడెలిటో మృతదేహాన్ని అతని ఇంట్లోనే గుర్తించారు.

కాగా ఫిడెలిటో ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో శిక్షణ పొంది అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేశారు.కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్న ఆయన అవుట్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన క్యూబా ప్రభుత్వానికి శాస్ర్త సలహాదారుగా ఉన్నారు. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

ఫిడెల్ క్యాస్ట్రో - ఆయన మొదటి భార్య మిర్తా దియాజ్-బాలార్ట్‌ కుమారుడే ఈ కాస్ట్రో దియాజ్-బాలార్ట్. మిర్తా దియాజ్ కుటుంబానికి బాటిస్టా ప్రభుత్వంతో సంబంధాలుండేవి. ఫిడెల్ - మిర్తాల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. మిర్తా కుటుంబం విప్లవ కాలంలో అమెరికా వలసవెళ్లింది. ఆమె తమ కుమారుడు కాస్ట్రో దియాజ్-బాలార్ట్‌ ను క్యూబాలో తన తండ్రి ఫిడెల్‌ ను కలవటానికి పంపించారు. అతడు మళ్లీ తల్లి వద్దకు తిరిగి వెళ్లలేదు. ఫిడెలిటోకు కాస్ట్రో పోలికలు ఉండడంతో ఆయన్ను అంతా లిటిల్ ఫిడెల్ అనేవారు. ఆయన పలు పుస్తకాలు రాశారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు అంతర్జాతీయ విద్యా సంబంధ కార్యక్రమాల్లో క్యూబా ప్రతినిధిగా పాల్గొన్నారు.