Begin typing your search above and press return to search.
చంద్రబాబు ముద్దు చేస్తే.. మొదటికే మోసం...!
By: Tupaki Desk | 27 Sep 2021 4:28 AM GMTరాజకీయాలైనా.. వ్యక్తిగతమైనా.. కొంత వరకే ఏదైనా పరిమితం. హద్దులు మీరితే.. మాత్రం.. ఖచ్చితంగా చర్య లు తప్పవు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు.ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. గత 2019 ఎన్నికల్లో.. టీడీపీ భారీ సంఖ్యలో సీట్లు కోల్పోయింది. గెలిచిన వారు చాలా స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు. అయితే.. వీరిలోనూ కొందరు పార్టీని విడిచిపోయారు. వారితో పార్టీకి ఇబ్బందిలేదు. ఇక, ఎటొచ్చీ.. పార్టీలోనే ఉన్నామని చెబుతూ.. పార్టీకి దూరంగా ఉంటూ.. పార్టీకి తెలియకుండా.. సొంత పనులు చక్క బెట్టుకుంటున్న వారివల్లే.. ఇప్పుడు టీడీపీకి నష్టమనే మాట జోరుగా వినిపిస్తోంది.
ఇలాంటివారిలో విజయవాడ ఎంపీ నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పేర్లు జోరుగా వినిపిస్తు న్నాయి. వీరు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఆతర్వాత.. వీరి వల్ల పార్టీకి ఒన గూరిన ప్రయోజనం అనేది భూతద్దం పట్టుకుని వెతికినా.. కనిపించడం లేదు. అంతేకాదు.. ఒకరు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మరొకరు అధికార పార్టీ నేతలతో లోపాయికారీ... ఒప్పందాలు చేసుకున్నారనే గుసగుస వినిపిస్తోంది. అయితే.. వీరిలో ఒకరు తాము టీడీపీలోనే ఉన్నామని.. ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ, మరొకరు మాత్రం ఖండించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. వచ్చే ఎన్నిల్లో వీరిని ఏం చేస్తారు? చంద్రబాబు ఇప్పటికీ వీరిపట్ల సానుకూ లంగా ఉండడం.. వారి విషయంలో సానుభూతి చూపించడం.. వంటి పరిణామాలు.. వీరిని విభేదిస్తున్న క్షేత్రస్థాయి నాయకులకు మింగుడు పడడం లేదు. వీరిని కాదనాలనేది క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు చేస్తున్న విజ్ఞప్తి. వేరేవారికి అవకాశం ఇవ్వాలని.. పార్టీ అంటే విధేయత లేదని.. అలాంటివారికి టికెట్లు ఇవ్వరాదని.. అంటున్నారు.
ఇక, తాజాగా జరిగిన అయ్యన్న పాత్రుడి ఘటనలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని.. టీడీపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా.. ఈ ఇద్దరు నాయకులు మాత్రం స్పందించలేదు. మిగిలిన వారు అందరూ.. స్పందించినా.. గంటా, కేశినేని మాత్రం మౌనంగా ఉన్నారు. దీంతో ఇలాంటివారిని ముద్దు చేస్తే.. చంద్రబాబుకు మొదటికే మోసం వస్తుందని క్షేత్రస్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.