Begin typing your search above and press return to search.
ఫిఫా కప్.. క్వార్టర్స్ లో ఇద్దరు మాజీ చాంపియన్ల నిష్క్రమణ..? 'తుపాకీ' విశ్లేషణ
By: Tupaki Desk | 5 Dec 2022 2:30 PM GMTఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ మధ్య దశకు వచ్చింది. రౌండ్ 16 (ప్రిక్వార్టర్స్) పోటీలు రంజుగా సాగుతున్నాయి. ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వస్తున్నాయి. ఫేవరెట్లు, మాజీ చాంపియన్లు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటివరకు నెదర్లాండ్స్ -అమెరికా, అర్జెంటీనా-ఆస్ట్రేలియా, ఇంగ్లండ్-సెనెగల్, ఫ్రాన్స్-పోలండ్ మధ్య మ్యాచ్ లు ముగిశాయి. వీటిలో అర్జెంటీనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మాజీ చాంపియన్లు. ఇవన్నీ ముందుంజ వేసి క్వార్టర్స్ చేరాయి. మూడుసార్లు ఫైనలిస్టు అయిన నెదర్లాండ్స్ కూడా క్వార్టర్స్ గడప తొక్కింది.
రౌండ్ 16లో మిగిలిన మ్యాచ్ లు జపాన్-క్రొయేషియా, బ్రెజిల్ -దక్షిణ కొరియా, స్పెయిన్-మొరాకో, పోర్చుగల్-సౌదీ అరేబియా. ఇప్పటికైతే సంచలనం లేదు.. ఇకపై మాజీ చాంపియన్లు అర్జెంటీనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సునాయాసంగానే రౌండ్ 16 దాటాయి. నెదర్లాండ్స్ కూడా గట్టెక్కింది. అయితే, నేటి నుంచి జరగబోయే మ్యాచ్ లే కీలకం. ఇందులో జపాన్ -క్రొయేషియా మ్యాచ్ రాత్రి 8.30కు ప్రారంభం కానుంది. బ్రెజిల్-కొరియా మ్యాచ్ అర్థరాత్రి 12.30కు మొదలవుతుంది. సోమవారం అర్థరాత్రితో వీటిలో ముందంజ వేసే రెండు జట్లేవో తేలిపోనుంది. బ్రెజిల్ ఐదుసార్లు చాంపియన్ కాగా, క్రొయేషియా గత వరల్డ్ కప్ రన్నరప్. మంగళవారం రాత్రి మొరాకో-స్పెయిన్, అర్థరాత్రి పోర్చుగల్- స్విట్జర్లాండ్ మ్యాచ్ లు జరగనున్నాయి. బలబలాల ప్రకారమైతే వీటిలో బ్రెజిల్, క్రొయేషియా, స్పెయిన్, పోర్చుగల్ ముందంజ వేయాలి. సంచలనం నమోదైతే చెప్పలేం.
ఫేవరెట్లు ముందడుగేస్తే క్వార్టర్స్ లో నెదర్లాండ్స్ -అర్జెంటీనా తలపడనున్నాయి. ఇంగ్లండ్-ఫ్రాన్స్ తలపడనున్నాయి. అంటే.. వీటిలో రెండు వెనుదిరగడం ఖాయం. మరోవైపు బ్రెజిల్ క్వార్టర్స్ చేరితే.. బహుశా క్రొయేషియా, జపాన్ తో ఆడాల్సి ఉంటుంది. ఇంకోవైపు స్పెయిన్-పోర్చుగల్ మధ్య మరో మ్యాచ్ జరిగే వీలుంది. ఇవన్నీ పెద్ద మ్యాచ్ లే. బ్రెజిల్, స్పెయిన్ ఓడితే గనుక పెద్ద సంచలనమే.
సెమీస్ లో బ్రెజిల్-అర్జెంటీనా పోరు? ఫేవరెట్లు స్థాయికి తగినట్లు ఆడితే.. ఎటువంటి సంచనాలు లేకుండా క్వార్టర్స్ ముగిస్తే అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ సెమీఫైనల్ చేరే వీలుంది. పోర్చుగల్, నెదర్లాండ్స్,
ఇంగ్లండ్, క్రొయేషియా ఇంటిముఖం పడతాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్, స్పెయిన్ సెమీస్ చేరితే.. సెమీస్ లో ఫ్రాన్స్-స్పెయిన్ (లేదంటే పోర్చుగల్), అర్జెంటీనా-బ్రెజిల్ తలపడతాయి. అంటే రెండు యూరప్ జట్లు, రెండు దక్షిణ అమెరికా జట్లు సెమీస్ ఆడతాయి. అందులోనూ సెమీస్ లో అర్జెంటీనా-బ్రెజిల్ సెమీస్ అంటే చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదంతా ఫేవరెట్లు, ఫామ్ ఆధారంగా వేసిన అంచనా. ఇందులో సంచలనాలు జరిగి ఫేవరెట్లు నిష్క్రమిస్తే జట్ల పేర్లు మారొచ్చు.
ఆసియా సింహాల కథేంటో? ఆసియా తరఫున ప్రి క్వార్టర్స్ చేరిన జపాన్ సోమవారం క్రొయేషియాతో ఆడనుంది. బ్రెజిల్ ను దక్షిణ కొరియా ఢీ కొట్టనుంది. వీటిలో ఏ ఒక్కటి ముందడుగు వేసినా సంచలనమే. బ్రెజిల్ ను దక్షిణ కొరియా ఓడిస్తే అది టోర్నీకే హైలైట్. అటు క్రొయేషియాను జపాన్ మట్టికరిపించినా గొప్ప ఫలితమే. ఏదేమైనా ఆసియా జట్ల భవితవ్యం నేటి అర్థరాత్రితో తేలిపోనుంది. రెండూ ఓడితే.. టోర్నీలో ఆసియా కథ సమాప్తమైనట్లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.