Begin typing your search above and press return to search.

గూగుల్ సెర్చ్ లో కొత్త రికార్డు నమోదు చేసిన 'ఫిఫా'..!

By:  Tupaki Desk   |   19 Dec 2022 1:30 PM GMT
గూగుల్ సెర్చ్ లో కొత్త రికార్డు నమోదు చేసిన ఫిఫా..!
X
ఫుట్ బాల్ వరల్డ్ కప్(ఫిఫా) 2022 సమరం నిన్నటితో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా.. ఫ్రాన్స్ జట్లు కొదమ సింహల్లా తలపడ్డాయి. మ్యాచ్ ముగిసే నాటికి ఇరు జట్లు 3-3 గోల్స్ తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఇందులో అర్జెంటీనా 4 గోల్స్ చేయగా ఫ్రాన్స్ 2 గోల్స్ చేసింది.

ఈ క్రమంలోనే అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచ ఫుల్ బాల్ విజేతగా నిలిచింది. అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ కల సైతం ఈ ట్రోఫీ నెరవేరింది. కాగా ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గూగుల్ సెర్చ్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్ ను ఫిఫా-2022 సొంతం చేసుకుందని ఆల్ఫాబెట్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా వెల్లడించారు.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ గురించి సుందర్ పిచాయ్ తన మాట్లాడుతూ యావత్ ప్రపంచ మొత్తం ఒకే అంశం గురించి వెతుకుతుందా? అన్నట్లు కన్పించిందన్నారు. ఫుల్ బాల్ గొప్ప ఆటలలో ఒకటని కొనియాడారు. అర్జెంటీనా.. ఫ్రాన్స్ జట్లు బాగా టోర్నో యావత్ బాగా ఆడాయని సుందర్ పిచాయ్ కితాబిచ్చారు.

"జోగో బోనిటో.. మెస్సీ కంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదని.. గేమ్ ఆడటంలో ఇమ్హో ది గ్రేటెస్ట్.. వాట్ ఏ స్వాన్‌సాంగ్" అంటూ పిచాయ్ ట్వీట్ చేశాడు. ఈ ఫుట్ బాల్ ఫైనల్ సమయంలో #FIFAWorldCup గూగుల్ సెర్చ్ లో గడిచిన 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసిందని వెల్లడించారు.

పిచాయ్ ట్వీట్ పై లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పోడ్‌క్యాస్ట్ హోస్ట్, USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో పరిశోధన శాస్త్రవేత్త అయిన లెక్స్ ఫ్రిడ్మా స్పందించారు. "ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు తమ ఆటపై ఉన్న ప్రేమతో ఏకమయ్యారు.. ఇది ఫుట్‌బాల్ గొప్పదనం.. ఇది మనల్ని ఏకం చేసే నిజమైన గ్లోబల్ గేమ్" అని కామెంట్ చేశాడు.

గూగుల్ సెర్చ్ 1998లో ప్రారంభం కాగా 2022లో 90 శాతం కంటే ఎక్కువ మార్కెట్ తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. గూగుల్ సెర్చ్ ప్రతి యేటా ఎక్కువ సెర్చ్ కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తోంది. గత 25 ఏళ్లలో అత్యధిక సెర్చ్ లతో ఫిఫా వరల్డ్ కప్ 2022 సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈసారి ఫిపా ఫైనల్ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా సాగడంతో ఫుట్ బాల్ ప్రియులను ఎప్పటి గుర్తుండి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.