Begin typing your search above and press return to search.

ఫిఫా ప్రపంచకప్ : భీకరపోరుతో సమం.. పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం

By:  Tupaki Desk   |   18 Dec 2022 6:28 PM GMT
ఫిఫా ప్రపంచకప్ : భీకరపోరుతో సమం.. పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం
X
రెండు జట్లు భీకరంగా పోరాడిన ఫిఫా వరల్డ్ కప్ లో చివరకు అర్జెంటీనాను విజయం వరించింది. ఫ్రాన్స్ గట్టి పోటీనిచ్చినా కూడా వారికి అదృష్టం వరించలేదు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఫ్రాన్స్ పై అర్జెంటీనా అతి కష్టం మీద పెనాల్టీ షూటౌట్ లో నెగ్గింది.

తొలుత నిర్ణీత సమయంలో 3-3తో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు సమంగా నిలవడంతో పెనాల్టీ షూటట్ కు దారితీసింది.ఇందులో మెస్సీ అర్జెంటీనా ఆటగాళ్లు 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ ఆటగాళ్లు కేవలం 2 గోల్స్ చేశారు. అర్జెంటీనాను ప్రపంచకప్ విజేతగా నిలపడంతో ఆ టీం గోల్ కీపర్ కీరోల్ పోషించాడు. అతడు రెండు గోల్స్ ఆపి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. అలాగే మెస్సీ ఇన్నేళ్ల కలను నెరవేర్చాడు.

120 నిమిషాల పాటు సాగిన ఈ 3-3 థ్రిల్లర్ తర్వాత, అర్జెంటీనా 36 సంవత్సరాల తర్వాత మూడవ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అదీ పెనాల్టీలలో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అంతకుముందు లియోనెల్ మెస్సీ మరియు ఏంజెల్ డి మారియాలు చేసిన గోల్స్ తో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండవ అర్ధభాగంలో 97 సెకన్లలోపు మ్యాచ్ ముగ్గుస్తుందనగా ఫ్రాన్స్‌ పుంజుకుంది. బ్రేస్‌తో వెనక్కి తెచ్చిన కైలియన్ ఎంబపె గోల్ చేసి స్కోరు సమం చేశాడు.స్పాట్ నుండి ఎంబెపె చేసిన మరొక గోల్ ద్వారా ఫ్రాన్స్ తిరిగి స్కోరు సమం చేసింది.

ఫుడ్ పాయిజన్ అయ్యి కోలుకున్నాక ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ తన ఇష్టపడే లైనప్‌కు తిరిగి వచ్చాడు. మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్ కూడా వైరస్ నుండి కోలుకున్న తర్వాత ఉపమెకానో రాఫెల్ వరనేతో కలిసి ప్రారంభించాడు. అయితే ఒలివర్ గిరౌడ్ అతని ఎడమ వైపున కైలియన్ ఎంబెపే, అతని కుడి వైపున ఉస్మాన్ డెంబెలేతో స్కోరు సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరే అర్జెంటీనా గోల్స్ సమంచేసి షాకిచ్చారు.

ఈ టోర్నీ విజయంతో అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సి కల నెరవేరింది. తృటిలో గోల్డెన్ బూట్ అవార్డును కోల్పోయాడు. మ్యాచ్ కు ముందు మెస్సీ, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చెరో 5 గోల్స్ తో సమంగా నిలిచారు. ఫైనల్ లో మెస్సీ రెండు గోల్స్ చేయగా.. ఎంబాపే హ్యాట్రిక్ 3 గోల్స్ చేసి ఈ అవార్డును అందుకున్నాడు.