Begin typing your search above and press return to search.
రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దులు పెట్టిన భామలు!
By: Tupaki Desk | 10 July 2018 5:35 AM GMTఒక అమ్మాయి రోడ్డు మీద వెళుతుందనుకుందాం.ఆమెకు ముక్కు ముఖం తెలీని కుర్రాడు వచ్చి ఆమెను ముద్దాడితే..? ఆగమాగం చేస్తాం. ఆడోళ్లకు రక్షణ లేదా? అంటాం. లైంగిక వేధింపులంటూ కేసులు కూడా పెడతాం. అయితే.. ఇలాంటి ఆడోళ్లకు మాత్రమే ఎదురవుతాయా? మగాళ్లకు ఎదురైతే..? ఏదో మాటలు చెబుతారే కానీ.. అమ్మాయిలు అబ్బాయిలకు ముద్దులు పెట్టి షాకులిస్తారా? అది కూడా.. ఓపెన్ గా ఉంటే.. అవుననే చెప్పాలి.
ఇప్పుడు చైనా మీడియాలో భారీ ఎత్తున సాగుతున్న చర్చల్లో ఈ అంశం ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఒక మీడియా రిపోర్టర్ ను ఇద్దరు రష్యన్ భామలు నడి రోడ్డు మీద ముద్దు పెట్టుకోవటం పెద్ద చర్చగా మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. జియాన్ వాంగ్ రియల్ అనే సౌత్ కొరియా టీవీ రిపోర్టర్ వరల్డ్ కప్ కవరేజ్ కోసం రష్యాకు వెళ్లారు. ఒక మ్యాచ్ కు సంబంధించి అతగాడు లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాడు. అంతలో రష్యా మహిళా అభిమానులు రౌండప్ చేయగా.. అందులో ఇద్దరు అమ్మాయిలు మరింత ఉత్సాహంతో ఆ రిపోర్టర్ కు లైవ్ గా ముద్దులు పెట్టేశారు.
ఊహించని ఈ తీరుకు సదరు రిపోర్టర్ కంగారు పడ్డాడు. క్షణాల్లో తేరుకొని తన పని తాను చేసుకుపోయాడు. విచిత్రం ఏమంటే.. నెల క్రితం ఒక మహిళా రిపోర్టర్ కు ఒక రష్యాన్ కుర్రాడు ముద్దు పెట్టిన తీరుపై పలువురు తప్పు పట్టారు. మహిళలకు భద్రత లేదంటూ ప్రపంచ వ్యాప్తంగా స్పందనలు వెలువడ్డాయి.
మరి.. మగాడికి రష్యన్ భామలు పెట్టిన ముద్దు మాటేమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మహిళా రిపోర్టర్ కు ముద్దుతో ఎదురైంది లైంగిక వేధింపులే అయితే.. తాజాగా పురుష రిపోర్టర్‌కు రష్యన్ అమ్మాయిలు పెట్టిన ముద్దులు లైంగిక వేధింపుల కిందకు రావా? అన్నది ప్రశ్నగా మారింది. అమ్మాయిని అబ్బాయి కిస్ చేస్తే ఆగమాగం అయిపోయినప్పుడు.. ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు అతని అనుమతి లేకుండా ముద్దులు పెట్టటం ఎంతవరకు సబబు? అన్న ప్రశ్నల చర్చలతో చైనాలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. చైనాలో ఈ కిస్సుల మీద ఇంత రచ్చ జరుగుతుంటే.. బాధిత రిపోర్టర్‌కు చెందిన దక్షిణ కొరియాలో మాత్రం ఈ ఇష్యూను పెద్దగా పట్టించుకోవటం లేదట.