Begin typing your search above and press return to search.

ఐసిస్ సానుభూతిపరులను చంపేసిన లంక సైన్యం

By:  Tupaki Desk   |   27 April 2019 9:23 AM GMT
ఐసిస్ సానుభూతిపరులను చంపేసిన లంక సైన్యం
X
ఈస్టర్ సందర్బంగా శ్రీలంకలో మానవబాంబులుగా మారి ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి దాదాపు 300 మంది అమాయకుల ప్రాణాలు తీసిన సంఘటన కలిచివేసింది. ఆ ఘోరం మరువక ముందే శ్రీలంకలో మరోసారి శుక్రవారం మానవబాంబులు పేలాయి. అయితే శ్రీలంక భద్రతాబలగాలు కాల్పులకు పాల్పడుతుండగా ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నాయి. ఈ ఘటనలో 15మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

శ్రీలంకలో మానవ బాంబుల పేలుళ్ల తర్వాత శ్రీలంక సైన్యం మొత్తం దేశమంతా జల్లెడ పడుతోంది. అనుమానితుల కోసం పోలీస్ బలగాలు గాలిస్తున్నాయి. సమ్మంతురై అనే ప్రాంతంలో ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఉన్నారన్న సమచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నాయి. పోలీసుల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లుగా మారి తమను తాము పేల్చుసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15మంది మృతి చెందారు. ఇక్కడి నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

చనిపోయిన 15మంది నేషనల్ తౌవీద్ జమాత్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రముఠాగా శ్రీలంక పోలీసులు గుర్తించారు. వీరంతా ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్నారు. ఇప్పటికే 76మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సిరియా, ఇజిప్ట్ దేశానికి చెందిన వారే ఇందులో అత్యదికులున్నారు. మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయని తేలడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.