Begin typing your search above and press return to search.
ఒక్కడే 50 మందిని చంపేశాడు
By: Tupaki Desk | 13 Jun 2016 4:46 AM GMTపెద్దన్న ఉలిక్కిపడ్డాడు. కనివినీ ఎరుగని హింసాకాండకు పెద్దన్న రాజ్యంలోని వారంతానే కాదు.. ప్రపంచం సైతం ఒక్కసారి అలెర్ట్ అయ్యింది. ఒక ఉన్మాది దారుణానికి 50 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 9/11 తర్వాత అమెరికాలో చోటు చేసుకున్న అతి పెద్ద విషాదంగా దీన్ని భావిస్తున్నారు. ఈ ఉన్మాది వెనుక తీవ్రవాద సంస్థల సహకారం ఏమైనా ఉందా? అన్న సందేహాలు ఓపక్క వినిపిస్తుంటే.. ఈ దారుణానికి తామే కారణమంటూ ఇస్లామిక్ స్టేట్ చెప్పుకుంది. ఇంతటి దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఒక ఉన్మాది కాల్పులు జరిపితే 50 మంది చనిపోయారా? ఇంత మంది ప్రాణాలు తీసిన ఉన్మాది ఏమయ్యాడు? ఇంతకీ అతగాడు ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని అర్లెండో నగరం. అక్కడ స్వలింగ సంపర్కుల కోసం ఒక పబ్ ఏర్పాటు చేశారు. ‘పల్స్’ పేరిట నడిచే ఈ పబ్ ఫేమస్ అని చెబుతారు. ఎప్పటి మాదిరి ఈ వీకెండ్ లో పార్టీ జోరుగా సాగుతోంది. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో కళ్లు చెదిరే కాంతులు.. అదరగొట్టే బీట్స్ మధ్య మాంచి ఉత్సాహంగా పార్టీ చివరకు వచ్చేసింది. ఇదిలా ఉన్నప్పుడే పబ్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ను తుదముట్టించేసి పబ్ లోపలకు ప్రవేశించాడు. వచ్చి రాగానే విచక్షణా రహితంగా కాల్పులు షురూ చేశారు.
మ్యూజిక్ హోరులో కాల్పుల శబ్దాన్ని బీట్స్ గా భావించారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే రూఫ్ ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపటంతో పబ్ ప్రాంతం చీకటిగా మారింది. దారుణం జరుగుతుందన్న విషయం అక్కడి వారికి అర్థమైంది. వెంటనే అలెర్ట్ అయిన కొందరు కింద పడుకోగా.. మరికొందరు బాత్రూంల వైపు పరుగులు తీశారు. మరికొందరు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక బౌన్సర్ చొరవతో కొంతమంది ప్రాణాలు నిలిచాయి. వారు బయట పడ్డారు. తీవ్ర గందరగోళం మధ్య నిమిషం పాటు ఆగకుండా కాల్పులు జరిగాయి. అనంతరం మరిన్ని కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు.
ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే క్లబ్ వద్దకు చేరుకున్నా.. దాదాపు ఐదు గంటల పాటు లోపలకు వెళ్లలేదని చెబుతున్నారు. ఉన్మాదిని మట్టుబెట్టేందుకు ముందు.. ఆ పరిసర ప్రాంతాల్లోని వారిని ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించిన అధికారులు.. అనంతరం పేలుడు పదార్థాలతో గోడను పేల్చేశారు (ఎంతమేరకు ధ్వంసం చేయాలో అంతమేర ధ్వంసం చేసే వీలుంది). అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన ‘‘బేర్ క్యాట్’’తో ప్రత్యేక పోలీసు బృందం పబ్ లోపలకు ప్రవేశించింది.
ఈ సందర్భంగా ఉన్మాదికి.. పోలీసులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయని.. అంతిమంగా ఉన్మాదిని కాల్చేసిన భద్రతాధికారులు.. 30 మందిని కాపాడినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 53 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఉన్మాది చర్యతో మరణించిన 50 మందికి సంబంధించిన రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. ఉన్మాదే 50 మందిని పొట్టనబెట్టుకున్నాడని.. రెండోది.. ప్రత్యేక భద్రతా దళం (స్వాట్) గోడను పేల్చి లోపలకు వెళ్లిన తర్వాత ఉన్మాదికి.. అధికారులకు మధ్య జరిగిన కాల్పుల సమయంలో మరికొందరు మరణించినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ వాదనను నిర్దారించాల్సి ఉంది.
పల్స్ లో జొరబడి మారణహోమాన్ని సృష్టించింది ఒక్కరేనా? మరింతమంది ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉన్మాది విషయానికి వస్తే.. ఇతన్ని అఫ్ఘనిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అమెరికాలో స్థిరపడిన ఆఫ్ఘన్ దంపతులకు 1986లో పుట్టిన ఒమర్ మతీన్ గా గుర్తించారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో నివసిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని చెబుతున్నా.. 2013.. 2014 సంవత్సరాల్లో ఇతని కదలికలపై ఎఫ్ బీఐ దృష్టి పెట్టిందని.. కాకుంటే సరైన సాక్ష్యాలు లభించకపోవటంతో ఇతనిపై పెట్టిన కేసును మూసేసినట్లుగా చెబుతున్నారు.