Begin typing your search above and press return to search.
శత్రు దేశంలోనూ మోడీ హవా మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 27 Aug 2020 11:30 AM GMTప్రస్తుతం భారత్ - చైనా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రజల సెంటిమెంట్ల విషయానికి వస్తే.. చైనా పేరెత్తితేనే కస్సుమనే వారు చాలామందే ఉన్నారు. గాల్వామా ఉదంతం తర్వాత చైనా వస్తువుల్ని కొనేందుకు దేశ ప్రజలు ఇష్టపడటం లేదు. ఎక్కడిదాకానో ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చైనా బజార్ పేరుతో ఉండే షాపుల పేర్లను.. వాటి యజమానులు మార్చేసుకున్నారు. చైనా అన్నా.. చైనీయులన్నా అంతలా ఏవగించే పరిస్థితి దేశంలో నెలకొంది.
గతంతో పోలిస్తే.. చైనా తీరుపై భారత సర్కారు మెతకదనాన్ని ప్రదర్శించటం లేదు. ఏ మాత్రం అవకాశం లభించినా చర్యలు తీసుకోవటానికి వెనుకాడటం లేదు.చైనాకు సంబంధించి యాప్స్ లో భద్రతాపరమైన అంశాలపై కచ్ఛితమైన రిపోర్టు లభించిన నేపథ్యంలో.. పలు యాప్స్ ను బ్యాన్ చేయటమే కాదు.. మరో 250 యాప్స్ ను మానిటర్ చేస్తున్న వైనం తెలిసిందే.
దేశ ప్రజల విషయానికి వస్తే.. గతంలో మాదిరి చైనా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి ప్రదర్శించటం లేదు. ఒకవేళ.. చైనా వస్తువుకు.. మన దేశానికి సంబంధించిన వస్తువ ఉండి.. రెండింటికి మధ్య తేడా ఓ మోస్తరు వ్యత్యాసం ఉన్నప్పటికీ భారత్ వస్తువుల్ని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఇంతలా చైనా వ్యతిరేకత దేశంలో ఉంది.
మరి.. చైనాలో భారత్ మీదా.. భారత ప్రధాని మోడీ మీదా.. ఆయన సర్కారు మీద ఎలాంటి భావన ఉందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఆ దేశ అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ మోడీ సర్కారుపై చైనీయుల్లో ఉన్న వ్యతిరేకత ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో మోడీ సర్కారుకు అనుకూలంగా చైనాలోని యాభై శాతం మంది ప్రజలు ఓటు వేయటం షాకింగ్ గా మారింది.
ఈ సర్వే వివరాలు తెలిసిన తర్వాత చైనా సర్కారు సైతం షాక్ కు గురైనట్లుగా చెబుతున్నారు. మోడీ సర్కారుపై తమ దేశంలో భారీ వ్యతిరేకత ఉంటుందని భావించిన ఆ దేశ సర్కారుకు.. సర్వే ఫలితం వారిని విస్మయానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో భారతదేశంలో చైనా మీద వ్యతిరేకత గతంతో పోలిస్తే.. వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయాన్ని చైనీయులు వ్యక్తం చేయటం మరో ఆసక్తికరమైన అంశం. భారతీయులు తమను వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా.. చైనీయులు భారత ప్రధాని మోడీని అభిమానించటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.