Begin typing your search above and press return to search.

యాభై వేలు కొట్టు..వాలంటీర్ పోస్ట్ పట్టు!

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:44 AM GMT
యాభై వేలు కొట్టు..వాలంటీర్ పోస్ట్ పట్టు!
X
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి నిరోధానికి తను కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టం చేశారు. ఎలాంటి వ్యవహారాల్లోనూ అవినీతి తలెత్తడానికి లేదని మొదటి రోజు నుంచి జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. జగన్ చర్యలన్నీ అవినీతి నిరోధం చుట్టే సాగుతూ ఉన్నాయి.

అయితే ముఖ్యమంత్రికి ఈ విషయంలో సహకారం అందించేలా లేరు కొంతమంది ఎమ్మెల్యేలు. కొందరు అయితే ఆఖరికి గ్రామ వాలంటీర్ల పోస్టులకు కూడా వసూళ్లు చేస్తూ ఉన్నారని టాక్. ఒక్కో పోస్టుకు యాభై వేల రూపాయలను రేటుకు ఫిక్స్ చేసి కొంతమంది అమ్ముకుంటున్నారట. ఆ పోస్టుకు శాలరీనే ఐదు వేల రూపాయలు. అలాంటిది యాభై వేల రూపాయలకు అమ్ముకుంటున్నారట.

అందరూ కాదు కానీ కొందరు ఈ పని చేస్తున్నారట. కొందరు ఈ నియామకాలను నిజాయితీగా సాగనిస్తూ ఉన్నారు. మరి కొందరు క్యాడర్ కు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇంకొందరు డబ్బు ఎవరిస్తే వారికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.

గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీతరఫున పని చేసి బాగా సంపాదించుకున్న వాళ్లు కొందరు ఇప్పుడు ఆ పోస్టులను కొనుక్కొంటున్నారని సమాచారం. అక్రమ సంపాదనలో యాభై వేలు కట్టి మళ్లీ ఈ ప్రభుత్వంలోనూ దోపిడీకి ట్రయల్స్ వేయడానికి తెలుగుదేశం క్యాడర్ చాలా చోట్ల ఈ పదవుల్లోకి చేరిపోతోందని వార్తలు వస్తుండటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ ఈ పరిణామాలు అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయని తెలుస్తోంది.