Begin typing your search above and press return to search.
కొత్తకోణం; ‘తలాక్’ కు తలాక్ చెప్పాలంటున్నారు
By: Tupaki Desk | 2 Jun 2016 11:30 AM GMTకొన్ని మతాల్లో కొన్ని విధానాలు చాలా చిత్రంగా ఉంటాయి. కాలంతో పాటు ఇలాంటి వాటిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ.. రాజకీయకోణంలో కొన్ని అంశాల మీద అంతులేని మౌనాన్ని ప్రదర్శిస్తుంటారు మేధావులు.. ప్రజాస్వామ్యవాదులు. అదేమన్నా అంటే.. అది మతపరమైన అంశమని.. భావోద్వేగాలకు సంబంధించిన అంశాల మీద ఎలా సమాధానం చెబుతామంటూ తిరకాసు సమాధానం చెబుతుంటారు. ఒక భర్త.. తన భార్యకు కేవలం మూడుసార్లు ‘తలాక్.. తలాక్.. తలాక్’ అని అన్న వెంటనే వారి మధ్యనున్న వైవాహిక బంధం ముగిసిపోయినట్లుగా చెప్పటం ఎంత దుర్మార్గం. ఎంత మతాచారమైనప్పటికీ.. మహిళకు ఎలాంటి హక్కు లేకుండా చేసే ఇలాంటి ఆచారాన్ని మారిన కాలానికి తగినట్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ.. నాటి ఆచారాన్ని నేటి డిజిటల్ యుగంలోనూ కొనసాగించటం చూస్తేనే.. అసలుసిసలు రాజకీయ కోణం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. వివిధ మతాల్లోని అనాగరిక అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడే వారు.. ఇలాంటి అంశాల మీద గళం విప్పేందుకు ఇష్టపడరు. అదే సమయంలో.. తమ మతంలోని అభ్యంతరకరంగా ఉన్నఅంశాలకు వ్యతిరేకంగా గళం విప్పే వారు కనిపించరు. అలాంటి పరిస్థితికి భిన్నంగా దేశంలో తొలిసారి ఒక కొత్త తరహా ఆందోళన మొదలు కావటం స్వాగతించాల్సిన అంశం.
మూడుసార్లు తలాక్ చెబితే భార్యకు విడాకులు ఇచ్చేసినట్లుగా చెప్పే పద్ధతిని వ్యతిరేకిస్తూ భారతీయ ముస్లిం మహిళ ఆందోళన అనే సంఘం బయటకు రావటం.. తన వాదనను బలంగా వినిపించటమే కాదు.. ముస్లిం వర్గానికి చెందిన వారిని తమ వాదనకు మద్దుతు పలికేలా చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తలాక్కు తలాక్ చెప్పాలంటూ పోరాటం చేస్తున్న ఈ సంఘం ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు.
ఇందులో భాగంగా పిటీషన్ మీద సంతకాలు సేకరిస్తున్నారు. తలాక్ ను బ్యాన్ చేయాలన్న సదరు పిటీషన్ మీద ముస్లిం మహిళలే కాదు.. పురుషులు కూడా పెద్ద ఎత్తున సంతకాలు చేయటం గమనార్హం. తలాక్ ను రద్దే చేయాలంటూ పోరాడుతున్న జకియా సోమన్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. తలాక్ విధానం పట్ల 92 శాతం మంది ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ విధానాన్ని ముస్లిం పురుషులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మరి.. తలాక్ విషయంలో గళం విప్పుతున్న వారి విషయం మీద మేధావుల మాటేమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ముస్లింలు తమకు తామే తలాక్ ను వద్దంటున్న వేళ..మేధావులు.. ముస్లిం రాజకీయ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.